రోహిత్,  అతడి తండ్రి దామోదరన్,  మరో ఇద్దరిపై పుదుచ్చేరిలోని మెట్టుపాలయం పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులతో కలిసి బాధిత బాలిక ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  Cricket coaching కోసం వెళ్లిన తనని  లైంగికంగా వేధించారని  సదరు బాధిత బాలిక  ఫిర్యాదులో పేర్కొంది. 

ప్రముఖ డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్‌ పై sexual harassment కేసు నమోదైంది. Rohit Damodaran తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. 16 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారని ఆరోపణలతో రోహిత్, మిగిలిన ఐదుగురి పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 రోహిత్, అతడి తండ్రి దామోదరన్, మరో ఇద్దరిపై పుదుచ్చేరిలోని మెట్టుపాలయం పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులతో కలిసి బాధిత బాలిక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. Cricket coaching కోసం వెళ్లిన తనని లైంగికంగా వేధించారని సదరు బాధిత బాలిక ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో రోహిత్ తో పాటు అతడి తండ్రి, మరో ఇద్దరిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించినట్లు Child Welfare Committeeకి ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. 

అయితే వారిని అరెస్టు చేశారా? లేదా? ఇంకా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఏడాది జూన్లోDirector Shankar పెద్ద కూతురు ఐశ్వర్య తో రోహిత్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 

కాగా, ఈ ఏడాది జూన్ లో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో ఏడడుగులు నడిచింది. వేదమంత్రాల సాక్షిగా ఆమె రోహిత్ మూడు ముళ్ళు వేయించుకుంది.

చరిత్ర సృష్టించిన ఇండియా.. 100 కోట్ల మార్క్ దాటిన వ్యాక్సిన్ డ్రైవ్.. ఈ విజయం ప్రతి పౌరునిది అన్న మోదీ

తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిది స్టాలిన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రోహిత్ విషయానికి వస్తే ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ లీగ్ లో ఆడుతున్నాడు. ఆయన తండ్రి దామోదర్ చెన్నైలో పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నాడు. మధురై పాంతర్స్ క్రికెట్ టీమ్ కు యజమాని గాను వ్యవహరిస్తున్నాడు. ఇక శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు.