కెనడా దౌత్యవేత్తను 5 రోజులలో దేశం వదిలివెళ్లమని ఆదేశించిన భారత్..

ఐదు రోజుల్లోగా కెనడా దౌత్యవేత్త దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. దీంతో భారత్, కెనడాల మధ్య ఖలిస్థానీ చిచ్చు మరింత ముదిరినట్టైంది. 
 

Diplomatic war between India and Canada - bsb

ఢిల్లీ : భారత్ కెనడాల మధ్య దౌత్యయుద్ధం రోజురోజుకూ ముదురుతుంది. ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని కెనడా దౌత్యవేత్తకు భారత్ ఆదేశించింది. ఇప్పటికే కెనడాలోని భారత అధికారిని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెనక్కి పంపించారు.  ఖలిస్థానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ ఉందని కెనడా ఆరోపించింది. ఈ కెనడా ఆరోపణలను భారత్ ఇప్పటికే ఖండించింది. 

కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ ను హత్య చేయడం వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపించింది. కెనడా భద్రతా సంస్థలు ఈ ఆరోపణలను పరిశీలిస్తున్నాయని.. దీని మీద భారత్ ఆధారాలు ఇవ్వాలని కోరింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios