న్యూఇయర్ లో ప్రధాని మోదీ మొదటి భేటీ ... ఎవరీ దిల్జిత్ దోసాంజ్?
ప్రధాని నరేంద్ర మోడీతో నూతన సంవత్సరం 2025ని ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ మీటింగ్ తో ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగీతం, సంస్కృతి వంటి అంశాలపై చర్చించారు.
ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ నూతన సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంగీతంతో సహా పలు అంశాలపై వీరిద్దరు చర్చించారు. ఈ సమావేశం చాలా ప్రత్యేకమైనదని, గుర్తుండిపోయేదని దిల్జిత్ పేర్కొన్నాడు. తన డిల్-లూమినాటి ఇండియా టూర్ పోస్టర్‌ను ప్రధానికి బహూకరించారు.
2025కి ఇది అద్భుతమైన ఆరంభం అని దిల్జిత్ ఆనందం వ్యక్తం చేశారు. ఇలా దేశ ప్రధానితో సమావేశం జీవితంలో మరిచిపోలేని ముధుర జ్ఞాపకంగా పేర్కొన్నాడు. సంగీతంతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు దిల్జిత్ ఎక్స్ వేదికన ట్వీట్ చేసాడు.
దిల్జిత్ ట్వీట్ పై ప్రధాని కూడా స్పందించారు.''దిల్జిత్ తో సమావేశం గొప్పగా సాగింది. అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. అపార ప్రతిభను కలిగివుండటమే కాదు సంప్రదాయాలె తెలిసినవాడు. అతడితో సంగీతం, సంస్కృతి వంటి అంశాలపై చర్చించాను'' అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేసారు.
ఇదిలా ఉండగా లుధియానాలో జరిగిన డిల్-లూమినాటి ఇండియా టూర్ ముగింపు కార్యక్రమంలో దిల్జిత్ అద్భుత ప్రదర్శన ఇచ్చారు. అక్టోబర్ 26న న్యూఢిల్లీలో ప్రారంభమైన రెండు నెలల పర్యటన పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ మైదానంలో న్యూ ఇయర్ ఈవ్‌తో ముగిసింది.
లుధియానా కచేరీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. దిల్జిత్ ప్రముఖ పంజాబీ గాయకుడు, రాజకీయ నాయకుడు ముహమ్మద్ సాదిక్‌ను ను ఈ ఆహ్వానించారు. సాదిక్‌ను "రియల్ OG" అని పిలుస్తూ, ఆయనతో కలిసి మాల్కీ కీమా పాట పాడారు.
దిల్జిత్ పర్యటనలో దీపికా పదుకొనె, కార్తీక్ ఆర్యన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ముంబై, జైపూర్, చండీగఢ్, ఇండోర్, బెంగళూరు, ఢిల్లీ, గౌహతి వంటి ప్రధాన నగరాల్లో ఆయన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
లుధియానా కచేరీని చివరి నిమిషంలో షెడ్యూల్‌లో చేర్చారు. డిసెంబర్ 29న గౌహతిలో పర్యటన ముగించాలని భావించినప్పటికీ, పంజాబ్ అభిమానుల కోసం నూతన సంవత్సర వేడుకలను అందించడానికి పర్యటనను పొడిగించారు.