150 సార్లు కాల్ చేసిన లిప్ట్ చేయలేదని.. 230 కిలో మీటర్లు వెళ్లి భార్యపై దారుణం.. ఆపై తాను..
బెంగళూరులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఫోన్ లిప్ట్ చేయలేదని పోలీసు కానిస్టేబుల్ తన భార్యను గొంతు పిసికి చంపాడు. ఈ కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించాలని బాధితురాలి కుటుంబీకులు డిమాండ్ చేశారు.
భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజమే. అయితే.. కొన్నిసార్లు ఆ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారుతాయి. చిన్న చిన్న మనస్పర్థలే పెద్ద వివాదాలకు దారి తీస్తాయి. ఈ క్రమంలో తమ పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటారు. ఇలాంటి ఉదంతం కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యకు 150 సార్లు ఫోన్ చేసినా సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం పెంచుకున్నాడు. దాదాపు 230 కిలో మీటర్లు ప్రయాణించి తన భార్యను హత్య చేశారు.
వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని బెట్టహలసూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సుబ్రమణి చిన్న కుమార్తె ప్రతిభ. బీఈ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె నవంబర్ 13, 2022న కోలారు జిల్లా వీర్‌పుర చెందిన కానిస్టేబుల్ కిషోర్ కు ఇచ్చి వివాహం చేశారు. తొలుత వివాహబంధం సాజావుగా సాగి.. ప్రతిభ ప్రవర్తనపై అనుమానం వచ్చింది కిషోర్ కి. దీంతో నిత్యం ప్రతిభను అనుమానించే వాడు. ఆమె ఫోన్ లో మెసేజ్ లు,కాల్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేసేవాడు. ఆమెకు మెసేజ్ చేసినా లేదా ఆమెతో మాట్లాడిన ప్రతి వ్యక్తి గురించి విచారించేవాడు. ఆమె తన కాలేజీ స్నేహితులతో సంబంధముందని అనుమానించేవాడు.
ఆదివారం సాయంత్రం కిషోర్ ప్రతిభకు ఫోన్ చేసి ఏదో విషయంపై తిట్టడం మొదలుపెట్టాడు. ప్రతిభ ఏడుస్తుంటే తల్లి వెంకటలక్ష్మమ్మ ఫోన్ తీసి కాల్ డిస్‌కనెక్ట్ చేసింది. తాను ఏడుస్తూ ఉంటే.. అప్పుడే పుట్టిన బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రతిభ తల్లి చెప్పింది. దీంతో ప్రతిభ.. కిషోర్ కాల్ చేస్తే లిప్ట్ చేయొద్దని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం వరకు కిషోర్ దాదాపు 150 సార్లు ఫోన్ చేసిన ప్రతిభ కాల్ లిప్టు చేయలేదు. దీంతో తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు.
కండువాతో పీక పిసికి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో కానిస్టేబుల్ కిషోర్ .. ప్రతిభ పుట్టింటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి ప్రతిభ తల్లి వెంకటలక్షమ్మ డాబాపైకి వెళ్తోంది. గదిలో ప్రతిభ, పసికందు విశాంత్రి తీసుకుంటారు. హుటాహూటినా కిషోర్ ఆ గదిలోకి వెళ్లి తలుపులు మూసివేశాడు. కిషోర్ మొదట పురుగుల మందు తాగాడు. అనంతరం ప్రతిభను కండువాతో గొంతు పిసికి హత్య చేశాడు. వెంకటలక్ష్మమ్మ టెర్రాస్ వచ్చి తలుపు తట్టినా స్పందన లేదు. ప్రమాదాన్ని పసిగట్టిన ఆమె తలుపులు తెరవడానికి ప్రయత్నించింది.
ఆమె కంటిన్యూగా.. తలుపు తెరవు అంటూ అడగ్గా 15 నిమిషాల తర్వాత కిషోర్ తలుపు తెరిచాడు. తాను ప్రతిభను చంపేశానని చెప్పి అక్కడి నుంచి కిషోర్ వెళ్లి పోయాడు. కిషోర్ ప్రస్తుతం చిక్సిత పొందుతున్నాడు. నిందితుడు కిషోర్ ను కఠిన శిక్ష విధించాలని ప్రతిభ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తమ కూతురిని కట్నం కోసం కిషోర్ తల్లి వేధిస్తున్నదని వారు ఆరోపించారు. బాధితురాలు తండ్రిదండ్రుల ఫిర్యాదు మేరకు కిషోర్ పై హత్య నేరం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు కిషోర్ పరిస్థితి విషమంగా ఉంది. అతడు కోలార్‌లోని టమాకలోని ఆర్‌ఎల్ జాలప్ప ఆసుపత్రిలో చేరాడు. హోస్కోటే పోలీసులు అతడిని మరో ఆస్పత్రికి తరలించారు. డిశ్చార్జి అయిన తర్వాత యువకుడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.