రోడ్డు పక్క టీ తాగిన బిల్ గేట్స్: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రోడ్డు పక్కన టీ స్టాల్ లో టీ తాగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇండియా పర్యటిస్తున్నారు. అయితే తన పర్యటనలో భాగంగా రోడ్డు పక్కనే ఉన్న టీ దుకాణంలో బిల్ గేట్స్ టీ తాగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో బిల్ గేట్స్ రోడ్డు పక్కన ఉన్న డాలీ చాయ్ వాలా టీ కొట్టులో టీ తాగారు. నాగ్ పూర్ లోని రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గ్ లో డాలీ చాయ్ వాలా ఫేమస్.తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఈ చాయ్ వాలా అనుసరిస్తాడు. దీంతో అతను చాలా ఫేమస్ అయ్యాడు.అయితే డాలీ చాయ్ వాలా వద్ద బిల్ గేట్స్ టీ తాగాడు. అయితే తాను ఎవరికీ టీ అందించాడో తెలియదని డాలీ చాయ్ వాలా చెబుతున్నారు. ఈ విషయమై మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో తనకు అసలు విషయం అర్ధమైందని డాలీ చాయ్ వాలా చెప్పారు.
తాను టీ ఇచ్చే వరకు బిల్ గేట్స్ వేచి ఉన్నాడని అతను చెప్పాడు. తాను ఇచ్చిన టీ తాగిన తర్వాత వావ్.. డాలీకి చాయ్ అని బిల్ గేట్స్ చెప్పాడని టీ దుకాణ యజమాని చెబుతున్నారు.తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడ టీ విక్రయించాలని భావిస్తున్నట్టుగా డాలీ చాయ్ వాలా చెప్పారు. తన జీవితమంతా చిరునవ్వుతో టీ విక్రయించాలని భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
డాలీ టీ స్టాల్ వద్ద వన్ టీ ప్లీజ్ పేరుతో బిల్ గేట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ 'టీ' తయారీకి ప్రత్యేక పద్దతులను అవలంభిస్తున్నారని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. టీ తయారీదారుడు ప్రత్యేకమైన పద్దతి కూడ హైలెట్ అని ఆయన చెప్పారు.ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన వెంటనే వేలాది మంది ఈ వీడియోను చూశారు. డాలీ చాయ్ వాలా కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.