బుల్లెట్ కు గుడి కట్టి పూజలు: ఎందుకో తెలుసా?
తమకు ఇష్టమైన వారు దూరమైతే వారి గుర్తుగా స్మారక చిహ్నాలను ఏర్పాటు చేసుకుంటాం. అయితే మోటార్ బైక్ కు మాత్రం రాజస్థాన్ లో పూజలు నిర్వహిస్తున్నారు.
జైపూర్: బుల్లెట్ కు గుడి కట్టి పూజలు చేయడం గురించి మీరు విన్నారా? రాజస్థాన్ లో మాత్రం బుల్లెట్ కు గుడి కట్టి పూజలు చేస్తున్నారు. దీని వెనుక ఓ కథను స్థానికులు చెబుతుంటారు. ఈ గుడి కాలక్రమంలో బుల్లెట్ బాబా గుడిగా మారింది. అందుకే ఈ గుడిని బుల్లెట్ గుడిగా కూడ పిలుస్తారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ కు 50 కి.మీ. దూరంలో ఈ గుడి ఉంది. ఈ ప్రాంతానికి వెళ్తే స్థానికులు ఈ బైక్ కు కట్టిన గుడిలో పూజలు చేయడం కన్పిస్తుంది. మద్యం తాగి వాహనాలు నడపవద్దని కూడ సూచిస్తారు.
ఓం బాబా అనే వ్యక్తి బుల్లెట్ పై ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఓంబన్నా మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి బుల్లెట్ ను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
also read:టీడీపీ-జనసేన తొలి జాబితా: 14 మంది మహిళలు, 23 మంది కొత్తవాళ్లకు చోటు
అయితే బుల్లెట్ పోలీస్ స్టేషన్ నుండి ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లిందని స్థానికులు చెబుతుంటారు. అయితే బుల్లెట్ లో పెట్రోల్ లేకుండా చేసి తాళం వేసినా కూడ బుల్లెట్ తిరిగి ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లిందని స్థానికులు చెబుతారు. దీంతో బుల్లెట్ కు గుడి కట్టి పూజలు చేస్తుంటారు.
ఈ ఆలయానికి చేరుకోగానే ఎర్రటి దారాలు, కంకణాలు, పువ్వులు, అగరవత్తులతో అలంకరించిన చెట్టు కన్పిస్తుంది.ఈ చెట్టు తిరుగుతూ భక్తులు పూజలు చేస్తుంటారు. 1980 మోడల్ 350 సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ గాజు ఫ్రేమ్ లో ఉంటుంది. ఈ బైక్ ను పూలతో అలంకరించారు.
also read:తొలి జాబితా: టీడీపీ సీనియర్లకు దక్కని చోటు, ఎందుకంటే?
అంతేకాదు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓం బన్నా పెద్ద ఫోటో కూడ ఇక్కడ ఉంటుంది. 1988 డిసెంబర్ 2వ తేదీ రాత్రి ఓంబన్నా ప్రయాణీస్తున్న బుల్లెట్ ప్రమాదానికి గురైంది. ఈ బుల్లెట్ పై అతని స్నేహితుడు కూడ ఉన్నాడు. అయితే ఈ ప్రమాదంలో ఓంబన్నా మృతి చెందాడు. కానీ, అతని స్నేహితుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
అయితే అప్పట్లో జరిగిన ఘటనకు సంబంధించి స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. ప్రమాదం జరిగిన మరునాడు బుల్లెట్ ను ప్రమాద స్థలం నుండి పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు. అయితే బైక్ తిరిగి పోలీస్ స్టేసన్ నుండి ప్రమాద స్థలికి చేరుకుంది. ఆ తర్వాత ఈ బైక్ నుమ హుక్మా రామా ఇంటికి బైక్ ను పంపారు. అయినా కూడ ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుంది.
దరిమిలా ఈ ప్రమాదం జరిగిన స్థలానికి సమీపంలోని చెట్టు వద్ద బైక్ ను ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుండి ఈ బైక్ ను చెట్టు వద్దే గాజు గ్లాస్ ఫ్రేమ్ మధ్యలో ఉంచారు. చిన్న గుడి మాదిరిగా కట్టి పూజలు నిర్వహిస్తున్నారు.అప్పటి నుండి ఈ మందిరాన్ని బుల్లెట్ బాబా గుడిగా పిలుస్తున్నారు. ఓంబన్నా ఆత్మ ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులకు సహాయం చేస్తుందని స్థానికులు విశ్వసిస్తారు.