Asianet News TeluguAsianet News Telugu

క్యాన్సర్ తో పోరాడుతున్న సిద్ధూ భార్య.. జైళ్లో ఉన్న భర్త కోసం నవజ్యోత్ కౌర్ భావోద్వేగ ట్వీట్  

పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్‌ క్యాన్సర్‌ తో పోరాడుతున్నారు. ఆమెకు ఇన్వేసివ్ క్యాన్సర్ సోకిందని, ప్రస్తుతం అది స్టేజ్‌-2 దశలో ఉన్నదని వైద్యులు తెలిపారు.ఈ క్రమంలో ఆమె ట్విట్టర్ వేదికగా భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. 

Diagnosed with cancer, Navjot Singh Sidhu's wife writes to jailed husband
Author
First Published Mar 23, 2023, 11:06 PM IST

పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్‌కు క్యాన్సర్‌ సోకింది. ఆమెకు ఇన్వేసివ్ క్యాన్సర్ సోకిందని, ప్రస్తుతం అది స్టేజ్‌-2 దశలో ఉంది. దీంతో ఆమె బుధవారం నాడు డేరాబస్సిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు సాయంత్రం 4.30 గంటలకు MRM శస్త్రచికిత్స ప్రారంభమై నాలుగు గంటలపాటు కొనసాగింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.  

ఇంతకుముందు.. ఆయన (నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ) చేయని నేరానికి జైలు పాలయ్యాడు’ అంటూ ట్వీట్‌ నవజ్యోత్ కౌర్  ఓ భావోద్వేగమైన ట్వీట్‌ చేశారు.  ఆ ట్వీట్ లో పదేపదే మీకు ఆ న్యాయం జరుగుతుంది. నేను ప్రతిరోజు మీ రాక కోసం వేచి ఉన్నాను. సత్యం చాలా శక్తివంతమైనది, కానీ అది మిమ్మల్ని మళ్లీ మళ్లీ పరీక్షిస్తున్నది. కలియుగం క్షమించండి, భయంకరమైన క్యాన్సర్ యొక్క 2వ దశలో ఉన్నందున ఇప్పుడు మీ కోసం వేచి ఉండలేను. ఈరోజు సర్జరీ చేయాల్సి ఉంది. ఇప్పుడు నేను కత్తి కింద ఉన్నాను. ఈ విషయంలో ఎవరినీ నిందించలేము, ఎందుకంటే ఇది దేవుని చిత్తం. అని భావోద్వేగంతో రాసుకున్నారు.

మరో ట్వీట్ లో  పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను టార్గెట్ చేస్తూ సిద్ధూ చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నట్లు రాశారు.‘మీరు జైలుకు వెళ్లడానికి కారణమైన వారందరినీ క్షమించండి. భావోద్వేగానికి గురైన తన భర్త సిద్ధూను మరింతగా ఆశ్రయిస్తూ.. బయట ఉండి ప్రతిరోజూ నీ విడుదల కోసం ఎదురుచూడడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. 

గతంలో.. సిద్ధూను ఇరికించిన కేసులో తన తప్పేమీ లేదని  మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూపేర్కొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలు తనను ఇరికించాయని ఆరోపించారు. అక్రమార్కులు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తిని కుట్ర కింద ఇరికించారని అన్నారు. ఈ కుట్ర అంతా బాదల్, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పన్నారని ఆరోపించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏప్రిల్ 1 నాటికి జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. తాను జైలు నుంచి బయటకు రాగానే పంజాబ్ కోసం, అక్కడి ప్రజల కోసం మునుపటిలా పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు. 

సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది శిక్ష  

34 ఏళ్ల నాటి రోడ్ రేజ్ కేసులో సిద్ధూకి సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన 1988 నాటిది. పంజాబ్‌లో సిద్ధూ నడిరోడ్డుపై గొడవ పడ్డాడు. అతని దెబ్బలకు ఓ వృద్ధుడు చనిపోయాడు. ఈ కేసులో.. సుప్రీం కోర్టు సిద్ధూను హత్య కాదు నేరపూరిత నరహత్య అభియోగం నుండి నిర్దోషిగా ప్రకటించింది . రూ. 1000 జరిమానా విధించింది, అయితే ఈ కేసులో రివ్యూ పిటిషన్‌ను విచారించినప్పుడు.. సుప్రీం కోర్టు సిద్ధూకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత సిద్ధూ మే 20న లొంగిపోయాడు.

క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా..  

నవజ్యోత్ సిద్ధూ యాంకర్ గా టీవీలో చాలా పేరు సంపాదించారు. పంజాబ్ పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అమృత్‌సర్‌ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న సిద్ధూ అసలు గుర్తింపు క్రికెట్‌ నుంచే. అతని తండ్రి సర్దార్ భగవంత్ సింగ్ క్రికెట్ క్రీడాకారుడు. తన కొడుకు కూడా తనలాగే ఆటగాడు కావాలని కోరుకున్నాడు. తన తండ్రి కోరికను తీర్చేందుకు సిద్ధూ 1983లో భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. సిద్ధూ మొత్తం 51 టెస్టు మ్యాచ్‌లు, 136 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 3202 పరుగులు, వన్డేల్లో 4413 పరుగులు చేశాడు. దాదాపు 17 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ ను కొనసాగించి 1999లో రిటైరయ్యాడు.

క్రికెట్ తర్వాత బుల్లితెరపై సిద్ధూ తనదైన ముద్ర వేశాడు. కామెంట్రీ చేయడమే కాకుండా బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా భాగమయ్యాడు. అతను గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ , ది కపిల్ శర్మ షోలో కూడా భాగమయ్యాడు. ఇది కాకుండా.. అతను ముజ్సే షాదీ కరోగి, ABCD 2 చిత్రాలలో అతిధి పాత్రలు చేసాడు. మేరా పిండ్ అనే పంజాబీ సినిమాలోనూ నటించాడు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన రాజకీయ ప్రయాణాన్ని 2004లో ప్రారంభించారు. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ 2004లో సిద్ధూను బీజేపీలోకి చేర్చుకున్నారు. బీజేపీలో ఉన్న సమయంలోనూ, బీజేపీని వీడిన తర్వాత కూడా జైట్లీని తన రాజకీయ గురువుగా భావించేవాడు సిద్ధూ. 2004లోనే..సిద్ధూ మొదటిసారిగా అమృత్‌సర్ లోక్‌సభ స్థానం నుండి బిజెపి టిక్కెట్‌పై పోటీ చేసి, కాంగ్రెస్ దిగ్గజం రఘునందన్ లాల్ భాటియాపై 1 లక్ష 9 వేల 532 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కొన్ని అభిప్రాయాల భేదాలతో 2017లో సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అదే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు అమృత్‌సర్‌లో 42 వేల 809 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సిద్ధూను పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా నియమించారు.

Follow Us:
Download App:
  • android
  • ios