Asianet News TeluguAsianet News Telugu

డీహెచ్‌ఎఫ్‌ఎల్ స్కామ్‌.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ స్వాధీనం చేసుకున్న సీబీఐ

DHFL scam: దేశంలోనే అతిపెద్ద రూ.34,615 కోట్ల బ్యాంకు స్కామ్ కేసుకు సంబంధించి పూణేలోని బిల్డర్ అవినాష్ భోన్సాలే ప్రాంగణంలో అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్‌ను  కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) సీజ్ చేసింది.

DHFL Scam: AgustaWestland helicopter seized by CBI
Author
Hyderabad, First Published Jul 31, 2022, 3:02 AM IST

DHFL scam: భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్ అయిన ₹ 34,000 కోట్ల రూపాయ‌ల‌ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ స్కామ్  (DHFL scam) కేసులో మనీలాండరింగ్,  అక్ర‌మాల‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్డర్ నుంచి అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు పూణేలోని DHFL స్కామ్ నిందితులలో ఒకరైన అవినాష్ భోన్సాలే ఆస్తి వద్ద ఎత్తైన గోడలను అలంకరించే పాప్ కల్చర్ పోస్టర్‌లతో, హ్యాంగర్ లాగా నిర్మించిన పెద్ద హాలులో హెలికాప్టర్‌ను కనుగొన్నారు. ఈ కుంభకోణంలో సంపాదించిన ఆస్తులను గుర్తించేందుకు సీబీఐ గత కొద్ది రోజులుగా పలు చోట్ల సోదాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.

బ్యాంకు మోసం కేసులో డిహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కపిల్ వాధావన్, దీపక్ వాధావన్ స‌హా  ఇతరులపై జూన్ 20న సీబీఐ అభియోగాలు మోపింది. దీని గురించి ఓ అధికారి మాట్లాడుతూ.. రూ.34,614 కోట్ల బ్యాంకు మోసం కేసుకు సంబంధించి ఫూణేలోని వ్యాపారవేత్త అవినాష్ భోన్సాలేకు చెందిన అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం సీజ్ చేసిందని తెలిపారు. భోన్సాలే ప్రాంగణంలో సోదాల సందర్భంగా అధికారులు హెలికాప్టర్‌ను కనుగొన్నార‌నీ,  ఆ తర్వాత సీబీఐ శనివారం నాడు దానిని స్వాధీనం చేసుకుందని వెల్ల‌డించారు. కాగా, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌లో తయారు చేసిన హెలికాప్టర్‌ను ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన అవినాష్ భోన్సాలే కొనుగోలు చేసినట్లు ఇండియా టుడే నివేదించింది. 

DHFL కుంభకోణం కేసుకులో భాగంగా సీబీఐ దర్యాప్తునకు సంబంధించి జరిపిన సోదాల్లో 5.50 కోట్ల రూపాయల విలువైన‌ పెయింటింగ్‌లను CBI స్వాధీనం చేసుకుంది. సోదాల సమయంలో సీబీఐ 1956లో రూ. 3.50 కోట్ల విలువైన 'విలేజ్' పేరుతో రూపొందించిన ఆయిల్-ఆన్-కాన్వాస్ పెయింటింగ్‌ను, 1964లో రూ. 2 కోట్ల విలువైన ఎఫ్‌ఎన్ సౌజా పేరులేని ఆయిల్-ఆన్-లినెన్ ముక్కను స్వాధీనం చేసుకుంది.  సోదాల్లో రూ. 5 కోట్ల విలువైన జాకబ్ అండ్ కో, ఫ్రాంక్ ముల్లర్ జెనీవ్ ల‌ రెండు లగ్జరీ వాచీలను కూడా సీబీఐ స్వాధీనం చేసుకుంది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (DHFL), దాని అప్పటి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ వాధావన్, అప్పటి డైరెక్టర్ ధీరజ్ వాధావన్, వ్యాపారవేత్త సుధాకర్ శెట్టి స‌హా  ఇతర నిందితులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంను మోసం చేయడానికి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు.

“నేరపూరిత కుట్రను అనుసరించి, నిందితుడు కపిల్ వాధావన్, ఇతరులు రూ. 42,871 కోట్ల భారీ రుణాలను మంజూరు చేసేలా కన్సార్టియం బ్యాంకులను ప్రేరేపించారు. అలాగే, DHFL ఖాతా  పుస్తకాలను తప్పుగా చూపడం ద్వారా నిధులలో గణనీయమైన భాగాన్ని స్వాధీనపరుచుకున్నారు. అలాఏ, నిధుల దుర్వినియోగానికి పాల్ప‌డ్డారు. కన్సార్టియం బ్యాంకుల చట్టబద్ధమైన బకాయిలు, తద్వారా కన్సార్టియం రుణదాతలకు రూ. 34,615 కోట్ల తప్పుడు నష్టం వాటిల్లుతోంది’’ అని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. DHFL, కపిల్ వాధావన్, ధీరజ్ వాధావన్, స్కైలార్క్ బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్, దర్శన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్,  సిగ్టియా కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టౌన్‌షిప్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శిశిర్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌బ్లింక్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ స‌హ ప‌లువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios