బెంగుళూరు: ప్రేమించిన యువతితో ఇంటికి పిలిపించి చితకబాదడంతో  ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చోటు చేసుకొంది.కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా నగరంలోని కల్లజల్లి లేఔట్‌లోని విశ్వేశ్వర నగర్ కు చెందిన సతీష్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. 

సతీష్ కొడుకు దర్శన్ కు 17 ఏళ్లు.  అదే ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్ధినితో అతనికి పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆ బాలికతో దర్శన్ తరచూ ఫోన్ లో మాట్లాడేవాడు.అంతేకాదు ఆ అమ్మాయిని బయట కలిసేవాడు. ఈ విషయం   బాలిక తల్లిదండ్రులకు తెలిసింది.  దీంతో ఆ యువకుడికి బుద్ది చెప్పాలనుకొన్నారు. బాలిక తండ్రి మాండ్యా నగరసభ ఏడవ వార్డు మెంబర్ శివలింగ, ఆయన భార్య అనురాధ ఓ ప్లాన్ వేశారు.తమ కూతురితో దర్శన్ కు ఫోన్ చేయించారు. ఇంట్లో ఎవరూ ఇంటికి రావాలని పిలిపించారు. ఈ ఫోన్ రాగానే  దర్శన్ బాలిక ఇంటికి వెళ్లాడు.  దర్శన్ కోసం ఇంట్లోనే ఎదురుచూస్తున్న అమ్మాయి పేరేంట్స్  అతడు రాగానే పట్టుకొన్నారు.

దర్శన్ ను విపరీతంగా కొట్టారు. ఈ దెబ్బలకు తాళలేక దర్శన్ అరిచాడు. ఈ అరుపులు విన్న స్థానికులు దర్శన్ పేరేంట్స్  కు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో బాలిక ఇంటికి చేరుకొన్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ముందే దర్శన్ ను  బాలిక పేరేంట్స్ కొట్టారు.ఈ దెబ్బలకు దర్శన్ అక్కడికక్కడే సొమ్మసిల్లిపడిపోయాడు. మిమ్స్ ఆసుపత్రికి అతడిని తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దర్శన్ మరణించాడు.ఈ ఘటనపై దర్శన్ పేరేంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన అమ్మాయి తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలని దర్శన్ పేరేంట్స్ కోరుతున్నారు.