Dharmasthala: ధర్మస్థల కేసులో తన కూతురు కనిపించకుండా పోయిందని చెప్పుకుంటున్న సుజాత భట్ గురించి ఆమె బావ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. పెళ్లి కూడా కాని సుజాత, అక్రమ సంబంధం, గర్భస్రావం, రిమాండ్ హోం నుంచి పారిపోవడం వంటి విషయాలు బయటపడ్డాయి.

Dharmasthala: ధర్మస్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కూతురు కనిపించకుండా పోయింది ఇక్కడే అంటూ ఆరోపణలు చేసిన సుజాత భట్. ఆమెది ఉడుపి దగ్గర్లోని పరిక గ్రామం. ముగ్గురు అక్క చెల్లెళ్ల కుటుంబంలో పెరిగింది. మరి సుజాత భట్ వీరేంద్ర హెగ్గడే, హర్షేంద్ర హెగ్గడేల మీద ఆరోపణలు చేయడానికి కారణం ఏంటని లోతుగా పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ వివాదం బయటపడింది. సుజాత భట్ గురించి ఆమె బావ మహాబలేశ్వర చెప్పిన కొన్ని సంచలన విషయాలు ఇవి...

ధర్మస్థలలో వందలాది శవాలు పూడ్చారని ఎవరో ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఎస్ఐటీ వేసింది. ఇంతలో సుజాత భట్ అనే ఆవిడ తన కూతురు 22 ఏళ్ల క్రితం ధర్మస్థలలో కనిపించకుండా పోయిందని, ఎవరో ఆమెను చంపి ఉంటారని, దొరికిన అస్థిపంజరాలను తన డీఎన్ఏతో పోల్చి చూడమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మరి ఈ సుజాత భట్ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అసలు పేరు ఏంటి? కుటుంబం ఎవరు? ఈ వివరాలన్నీ ఆమె బావే బయటపెట్టారు.

సుజాత భట్ అక్క వారిజా భర్త మహేశ్వర భట్ (సుజాత భట్ బావ) మాట్లాడుతూ.. "సుజాత నాకు 1988 నుంచి తెలుసు. ఆమె అక్కని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తెలుసు. 2003లో తన కూతురు ధర్మస్థలలో కనిపించకుండా పోయిందని సుజాత ఫిర్యాదు చేసింది. కానీ ఆమెకు పెళ్లే కాలేదు. అక్రమ సంబంధంతో గర్భవతి అయ్యి, ఆరూరు క్లినిక్‌లో గర్భస్రావం చేయించుకుని, సీతా నదిలో పిండాన్ని పడేసింది.

తర్వాత ఉడుపి బస్టాండ్‌లో అక్రమ వ్యవహారం చేస్తుండగా పట్టుబడి, నిట్టూరు రిమాండ్ హోంలో ఉంచారు. అక్కడి నుంచి తప్పించుకుని, ఉడుపి, నిట్టూరు వదిలి పారిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. మూడేళ్ల తర్వాత బెంగళూరు వచ్చింది. అప్పుడు సుజాత అక్క, నా భార్య వారిజా.. 'తప్పులు జరిగిపోయాయి, చెల్లికి ఉద్యోగం ఇప్పించు' అని అడిగింది. మా వాళ్లదే అయిన శేఖర్ ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పించా. అక్కడ వారం రోజులు పనిచేసి అక్కడి నుంచి కూడా పారిపోయింది.

పర్కళ దగ్గర్లో పరికార అనేది వాళ్ల కుటుంబం. వాళ్ల నాన్నకు ముగ్గురు పిల్లలు. సుజాత చివరిది. ఆమెను ఎవరూ ఇష్టపడరు. ఆమె సొంత అన్నయ్యే 'సుజాతను ఎవరూ ఇంట్లోకి రానివ్వద్దు, ఇంటి పరువు తీసింది' అని బంధువులందరికీ చెప్పాడు. సుజాత అక్క వారిజాతో బెంగళూరులో ఉండేది. కోర్టు దగ్గర ఓ దుకాణం పెట్టుకుని బతికేవాళ్లం. మా దుకాణానికి ఒకసారి వచ్చి 'బావ, నేను రిప్పన్‌పేటే వాళ్లను పెళ్లి చేసుకున్నా. మీకేమైనా కావాలంటే అడగండి' అని చెప్పింది.

మూడేళ్ల తర్వాత మళ్లీ మా ఇంటికి వచ్చి 'బావ, నేను జడ్జి ఇంట్లో పని చేస్తున్నా. మీకేమైనా సాయం కావాలా అడగండి. ఈ చెక్ తీసుకోండి, డబ్బులు తీసుకోండి' అంది. జడ్జి ఇచ్చిన చెక్ తీసుకుంటే నన్ను జైల్లో పెడతారేమో అని భయపడి 'నీ సాయం వద్దు, ఇంకెప్పుడూ ఇక్కడికి రావద్దు' అని పంపించేశా. అదే ఆఖరిసారి. 2002-03 తర్వాత ఆమె నాకు కనిపించలేదు" అని చెప్పారు.