Heavy Rains: భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వచ్చే 3 రోజులు బయటకు రావొద్దు
Telangana Rains: రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం, అధికారులు అప్రమత్తం అయ్యారు.

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలో ఈ వారంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. గతవారం నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మంగళవారం కూడా వర్షాలు పడ్డాయి.
కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. పాతబస్తీలో 114 ఏళ్ల పురాతన భవనం కూలిపోవడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
KNOW
బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఆగస్టు 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మంగళవారం 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలో మీటర్ల వేగం వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rainfall Alert 🌧️
Telangana: Very heavy to extremely heavy rain likely in isolated areas from 13th to 16th August.
Coastal Andhra Pradesh, Yanam & Rayalaseema: Isolated heavy to very heavy rain expected on 13th & 14th August.
⚠️ Safety First:
• Postpone non-essential… pic.twitter.com/cQanKxxGje— India Meteorological Department (@Indiametdept) August 12, 2025
ఇండ్లనుంచి బయటకు రావొద్దు: హైడ్రా హెచ్చరికలు
ఆగస్టు 13, 14, 15 తేదీల్లో మేడ్చల్, సైబరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురవవచ్చని హైడ్రా (Hydraa) పేర్కొంది. 10–15 సెం.మీ. వర్షపాతం నమోదవుతుందని, కొన్ని చోట్ల 20 సెం.మీ. దాకా చేరవచ్చని అంచనా వేసింది.
మూడు రోజులపాటు బయటకు రావొద్దని తెలిపింది. అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించింది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫార్సు చేశారు.
⚠️ Hyderabad Weather Alert ⚠️
Extremely heavy rains are forecast from 13th August (Wednesday) to 15th August (Friday). 🌧️⛈️
📍 Most affected: Northern Hyderabad — Medchal district, Cyberabad area (within HYDRAA limits)
💧 Rainfall: 10–15 cm, some places may receive up to 20 cm…— HYDRAA (@Comm_HYDRAA) August 12, 2025
భారీ వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మూడు రోజులపాటు అన్ని శాఖల ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. ఆకస్మిక వరదల కోసం హెలికాప్టర్లను సిద్ధం చేయాలనీ, NDRF సిబ్బందిని ముందుగానే పంపించాలని ఆదేశించారు.
రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో సీనియర్ అధికారులను నియమించాలంటూ సూచించారు. ప్రజలకు వరద సమాచారం మీడియా ద్వారా చేరవేయాలని, టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy participates in video conference with all District Collectors at TGICCC, Hyderabad. https://t.co/CpriEdh30V
— Telangana CMO (@TelanganaCMO) August 12, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు
కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, మహబూబ్‌నగర్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.