తనను భర్త మానసికంగానే కాకుండా శారీరకంగా వేధిస్తున్నాడంటూ ధర్మశాల ఎమ్మెల్యే భార్య సోషల్ మీడియా వేధికన తన ఆవేధనను భయటపెట్టింది. 

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ కు చెందిన అధికార బిజెపి ఎమ్మెల్యేపై సొంత భార్యే వేధింపుల ఆరోపణలు చేసింది. తనను భర్త మానసికంగానే కాకుండా శారీరకంగా వేధిస్తున్నాడంటూ ఎమ్మెల్యే భార్య సోషల్ మీడియాలో తన ఆవేధనను బయటపెడుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారి బాధితురాలికి మద్దతు లభించింది.

వివరాల్లోకి వెళితే... హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల ఎమ్మెల్యే విశాల్‌ నెహ్రియా కంగ్రా జిల్లా నగ్రోటా సురియన్‌ బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారి ఓషిన్‌ శర్మతో ఈ ఏడాది వివాహమైంది. కాలేజీలో చదివే సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి పెళ్లిపీటలకు చేరింది. అయితే పెళ్లయిన నాటినుండి భర్త తనను వేధిస్తున్నాడని ఓషిన్ తాజా వీడియోలో బయటపెట్టింది.

read more దారుణం: నవ వధువుపై భర్త, మరదులు గ్యాంగ్ రేప్

పెళ్లి తర్వాతే కాదు పెళ్లికి ముందు కూడా విశాల్ తనను కొట్టేవాడని... దీంతో అతడికి కొంతకాలం దూరంగా వున్నానని ఓషిన్ వెల్లడించారు. అయితే 2019లో విశాల్ ధర్మశాల ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చాడని... అతడు మారివుంటాడని భావించి పెళ్లికి అంగీకరించినట్లు ఓషిన్ తెలిపారు. కానీ పెళ్లి తర్వాత అతడి వేధింపులు మరింత ఎక్కువయ్యాని... అతడి కుటుంబసభ్యులు కూడా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఓషిన్ ఆవేదన వ్యక్తం చేశారు.