మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో నదిలో యువతి గల్లంతైన విషయం కలకలం రేపింది. ఆ యువతుల సెల్ఫీ మోజు వారి ప్రాణాలమీదకు తెచ్చింది. నదిలో దిగిన ఏడుగురు యువతులు ప్రమాదానికి గురయ్యారు. సెల్ఫీ తీసుకునే ఉద్దేశంతో నదిలో దిగి, నీట మునిగారు. 

వీరిలో ఆరుగురిని అక్కడున్న మత్స్యకారులు కాపాడారు. ఒక యువతి మాత్రం గల్లంతయ్యింది. ఆనందంగా పిక్నిక్ చేసుకుందామని వచ్చిన వీరికి చివరికి విషాదం మిగిలింది. దేవాస్‌లోని రాజానల్ నదిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

మొత్తం ఏడుగురు యువతులు నది సమీపంలోకి వచ్చారు. ఇంతలో ఒక యువతి కాలుజారి నదిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు మిగిలిన ఆరుగురు యువతులు ప్రయత్నించారు. అయితే వారు కూడా నదిలో పడిపోయారు. దీంతో వీరు కేకలు వేశారు. 

వీరిని గమనించిన మత్స్యకారులు వెంటనే నదిలోకి దిగి కాపాడారు. అయితే ఒక యువతి గల్లంతయ్యింది. ప్రస్తుతం గల్లంతైన యువతి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.