Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. డెంగ్యూ పేషెంట్ కు ప్లాస్మాకు బదులు మోసంబి జ్యూస్ ఎక్కించిన వైద్య సిబ్బంది.. బాధితుడు మృతి..

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ రోగి చనిపోయారు. డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న ఓ రోగికి  వైద్య సిబ్బంది ప్లాస్మాకు బదులు మోసంబి పండ్ల రసాన్ని ఎక్కించారు. దీంతో అతడు చనిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

Dengue patient died after medical personnel injected Mosambi juice instead of plasma.
Author
First Published Oct 20, 2022, 11:13 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించారు. దీని వల్ల ప్రదీప్ పాండే అనే రోగి మరణించాడు. సంగమ్ నగరంలోని బమ్రౌలీ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటన డాక్టర్ల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టింది. అయితే ఆ ఆస్పత్రికి బ్లడ్ సరఫరా చేసిన నకిలీ బ్లడ్ బ్యాంక్ యూనిట్‌ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని స్థానిక జర్నలిస్టు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నకలు చిట్టీని లవ్ లెటర్‌గా పొరబడిన బాలిక.. అబ్బాయిని చంపేసిన ఆమె సోదరులు

ప్లాస్మా, మోసంబీ జ్యూస్ చూడటానికి ఒకేలా ఉండటం వల్ల ఈ ఘటన జరిగింది. అయితే దానిని ఎక్కించిన తరువాత రోగి సిరల్లో రక్తం గడ్డకట్టిందని, దీని వల్ల అతడు చనిపోయాడని వర్గాలు వెల్లడించాయని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’నివేదించింది. ఈ ఘటనపై యూపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య విద్య మంత్రి  బ్రజేష్ పాఠక్ స్పందించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రయాగ్‌రాజ్ సీఎంవో ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ నివేదిక వచ్చిన తరువాత ఈ ఘటనకు బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ విడిచిపెట్టబోమని చెప్పారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సెలవులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. 
భారత ఆర్మీ కోసం 1000 నిఘా కాప్టర్లు అవసరం.. పాక్, చైనాలతో సరిహద్దుల్లో అనూహ్య పరిస్థితులు

కాగా..  ప్రదీప్ పాండే కుటుంబం యూనిట్‌కు రూ. 5000 చొప్పున ప్లేట్‌లెట్లను కొనుగోలు చేసిందని, పౌచ్‌లపై స్వరూప రాణి నెహ్రూ (ఎస్‌ఆర్‌ఎన్) మెడికల్ కాలేజీ లోగో ఉందని స్థానిక వర్గాలు తెలిపాయి. మూడు యూనిట్ల మార్పిడి తర్వాత, రోగి పరిస్థితి మరింత క్షీణించడంతో బంధువులు అతడిని జార్జ్ టౌన్ ప్రాంతంలోని మరో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడి సిరలు పగిలిపోయి రక్తం గడ్డకట్టినట్లు తెలిపారు. చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత ఆ జిల్లా పోలీసులు ఇద్దరు వ్యక్తులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత అలహాబాద్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ (ANHA) అధ్యక్షుడు డాక్టర్ సుశీల్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. రోగులు రిజిస్టర్డ్ డాక్టర్లను మాత్రమే సంప్రదించాలని కోరారు. డెంగ్యూ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని, ఈ నేపథ్యంలో మధ్యవర్తులపై ఆధారపడకుండా వ్యక్తిగతంగా బ్లడ్ బ్యాంకుల ద్వారా ప్లాస్మాను కొనుగోలు చేయడం మంచిదని అన్నారు.

జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌ వర్క్‌‌ 2022ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. వివరాలు ఇవే..

ఈ విషయంపై ఐజీ ప్రయాగ్రాజ్ రాకేష్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. డెంగ్యూ వ్యా ధిగ్రస్తులకు నకిలీ ప్లాస్మా సరఫరా చేయడంపై విచారణ జరుపుతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ కేసులో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కొద్ది రోజుల క్రితం నకిలీ బ్లడ్ బ్యాంకును కూడా ఛేదించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో రోగికి సరఫరా చేసింది మోసంబి జ్యూస్ ఆ కాదా అనే విషయం ఇప్పుడే స్పష్టంగా ఏమీ చెప్పలేమని ఐజీ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios