నిందితుడు బాధితుడి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి మూడు రోజుల పాటు తన ఇంట్లోనే ఉంచుకున్నాడని.. ఆ తరువాత రైల్వే ట్రాక్ దగ్గర తగలబెట్టాడని ప్రాథమిక విచారణలో తేలింది.
బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరులో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఐ ఫోన్ మీద మనసుపడ్డాడు. దానికోసం ఆన్ లైన్ లో ఆర్డర్ కూడా పెట్టాడు. కానీ తీరా అది డెలివరీ అయ్యే సమయానికి తన దగ్గర డబ్బులు లేవన్న విషయం తెలిసొచ్చింది. రిటన్ పంపడమో.. డోర్ లాక్ అనో సాకు చెప్పి తప్పించుకుంటే పోయేది. కానీ ఏకంగా ఏ సంబంధమూ లేని.. ఓ అమాయకుడి ప్రాణాలు తీశాడు.
ఐ ఫోన్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్ ను హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన ఫిబ్రవరి 7న కర్నాటకలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. ఆన్‌లైన్‌లో ఐఫోన్ ఆర్డర్ చేసిన 20 ఏళ్ల యువకుడు దానికి సంబంధించిన చెల్లించలేక డెలివరీ ఏజెంట్‌ను హత్య చేశాడు.హేమంత్ దత్ ఫిబ్రవరి 7న హాసన్ జిల్లాలోని తన ఇంటి వద్ద ఈ కార్ట్ డెలివరీ ఏజెంట్ హేమంత్ నాయక్‌ను పలుమార్లు కత్తితో పొడిచి చంపాడు.
యువకుడిని తలకిందులుగా.. చెట్టుకు వేలాడదీసి చిత్రహింసలు.. వీడియో వైరల్.. కారణం ఏంటంటే...
హత్య చేసిన తరువాత బాధితుడి మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి మూడు రోజుల పాటు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆ తరువాత రైల్వే ట్రాక్ దగ్గర తగలబెట్టాడని దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని కాల్చేందుకు, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పెట్రోల్ కూడా కొన్నాడని పోలీసులు తెలిపారు మంజు నాయక్ కనిపించకుండా పోవడంతో.. బాధితుడి సోదరుడు అదృశ్యమైనట్లు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఢిల్లీలోని దేవాలయం సమీపంలో గోవధ.. 22 ఏళ్ల యువకుడి అరెస్టు...
వీరి విచారణలో సీసీ టీవీ కెమెరాల్లో హేమంత్ దత్ తన టూ వీలర్ మీద మృతదేహంతో రైల్వే ట్రాక్‌ల వైపు వెళ్లడం నమోదయ్యింది. అంతకు రెండు రోజుల క్రితం పెట్రోల్ పంప్ లో హేమంత్ దత్ ఖాళీ సీసాలో పెట్రోల్ కొంటూ కనిపించాడు.దీంతో సదరు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారించగా.. తన దగ్గర ఫోన్ తీసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో తానే డెలివరీ బాయ్ మీద కత్తితో దాడి చేశానని.. దీంతో అతను చనిపోయాడని తెలిపాడు.
