నిందితురాలు పూజా కుమారి 2019 నుంచి జితేంద్రతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది. తన లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె అతని కొడుకును హత్య చేసింది. ఆ తరువాత ఫోన్ చేసి....

ఢిల్లీ : తనతో సహజీవనం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం.. అతని 11యేళ్ల కొడుకును దారుణంగా గొంతునులిమి చంపిందో మహిళ. ఆ తరువాత ఆ చిన్నారిని వారింట్లోనే బెడ్ బాక్సులో పెట్టి పారిపోయింది. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆదివారం పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు. 

బాలుడిని హతమార్చిన తరువాత తన ప్రియుడికి ఫోన్ చేసి.. ’నీకు అత్యంత విలువైన వస్తువును తీసేసుకున్నాను’ అంటూ ఎగతాళిగా ఏడిపించింది. 24 ఏళ్ల ఢిల్లీ మహిళ, తన లైవ్-ఇన్ భాగస్వామి 11 ఏళ్ల కుమారుడిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటోంది. అతనికి ఫోన్ చేసి.. ‘‘నీ నుండి అత్యంత విలువైన వస్తువును తీసుకున్నాను..." అని చెప్పిందని జితేంద్ర అనే ఆమె ప్రియుడు తెలిపాడు. 

దారుణం.. భార్యకు విడాకులిచ్చి తనతో ఉంటాడని ప్రియుడి కుమారుడిని చంపిన ప్రియురాలు..

నిందితురాలు పూజా కుమారి 2019 నుంచి జితేంద్రతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది. జితేంద్రకు అప్పటికే వివాహమైంది. భార్యనుంచి దూరంగా ఉంటున్నాడు. విడాకులు తీసుకుంటానని చెప్పి పూజతో మూడు సంవత్సరాలు గడిపాడు. ఆ తర్వాత, జితేంద్ర మనసు మార్చుకుని తన భార్య, కొడుకు దగ్గరికి తిరిగి వచ్చాడు. 

దీంతో కోపోద్రిక్తురాలైన పూజ, జితేంద్ర తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఇష్టపడకపోవడానికి జితేంద్ర 11 ఏళ్ల కుమారుడే కారణమని నమ్మింది. తన లివ్-ఇన్ భాగస్వామిని వివాహం చేసుకోవడానికి అతని మైనర్ కొడుకు అడ్డంకిగా ఉన్నాడని భావించింది. బాలుడిని ఎలాగైనా చంపాలనుకుంది. వారింటికి దొంగతనంగా వెళ్లి...బాలుడు నిద్రిస్తున్న సమయంలో పూజా గొంతు నులిమి చంపి.. బెడ్‌ బాక్సులో పెట్టేసి వచ్చింది. 

బాలుడు కనిపించకపోవడంతో అంతా వెతికిన తల్లిదండ్రులను చాలా సేపటికి విగతజీవిగా మంచంలోని బాక్సులో కనిపించాడు. ఆ తరువాత దీనికి కారణమైన పూజాను కొద్దిరోజులు గాలించిన తరువాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నేరం చేసినట్లు అంగీకరించింది.