Asianet News TeluguAsianet News Telugu

హెయిర్ కట్ లో పొరపాటు.. నష్టపరిహారంగా రూ. 2 కోట్లు...ఎందుకంటే.... !

 మహిళలకు తమ  జుట్టుతో భావోద్వేగపరమైన అనుబంధం ఉంటుందని,  వాటిని సంరక్షించుకునేందుకు,  మంచి స్థితిలో ఉంచుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శక్తికొద్దీ  ఖర్చు చేస్తారని వ్యాఖ్యానించారు.  

Delhi Woman Gets 2 Crore Compensation from ITC Maurya for Wrong Haircut
Author
Hyderabad, First Published Sep 24, 2021, 10:21 AM IST

ఢిల్లీ : మహిళకు తప్పుడు క్షవరం (Hair Cut) చేయడంతో పాటు ఆమె శిరోజాలకు తప్పుడు చికిత్స చేసినందుకు రెండు కోట్ల రూపాయల నష్ట పరిహారం(Compensation)గా చెల్లించాలని ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ కు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) ఆదేశాలు జారీ చేసింది. మోడలింగ్ (Modaling) లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలన్న ఆమె కల హోటల్ సిబ్బంది పొరపాటు కారణంగా సర్వనాశనం అయ్యింది అని వ్యాఖ్యానించింది.

ఈ మేరకు  ఎన్ సీడీఆర్ సీ అధ్యక్షుడు ఆర్కే అగర్వాల్, సభ్యుడు ఎస్ఎమ్ కాంతికార్ ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు తమ  జుట్టుతో భావోద్వేగపరమైన అనుబంధం ఉంటుందని,  వాటిని సంరక్షించుకునేందుకు,  మంచి స్థితిలో ఉంచుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శక్తికొద్దీ  ఖర్చు చేస్తారని వ్యాఖ్యానించారు.  

ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకోవాలి.. ప్రధాని మోదీతో కమలా హ్యారిస్..!

ఫిర్యాదు దారైన అషనా రాయ్  తనకున్న పొడవైన జుట్టు కారణంగా పలు కేశ సంరక్షణ ఉత్పత్తులకు మోడల్గా వ్యవహరించారని,  అనేక పెద్ద బ్రాండ్లకు పనిచేశారని కమిషన్ పేర్కొంది. అయితే, ఆమె సూచనలకు వ్యతిరేకంగా హెయిర్ కట్ చేయడం వల్ల అవకాశాలు దూరమయ్యానని,  ఆమె జీవితమే మారిపోయిందని, ఈనెల 21న జారీ చేసిన ఉత్తర్వులో కమిషన్ స్పష్టం చేసింది.  

సిబ్బంది పొరపాటు కారణంగా ఆమె తల కాలిపోయిందని,  ఇప్పటికీ  దురద, అలర్జీతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించింది. ఫిర్యాదురాలి  వాట్స్అప్ చాట్ ను  పరిశీలించగా  హోటల్ యాజమాన్యం  తన తప్పును  అంగీకరించడంతో పాటు  దిద్దుబాటు చర్యలు  చేపడతామని  అంగీకరించిందని  ఎన్ సీడీఆర్ సీ చెప్పింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios