అమెరికా, భారత దేశ భద్రతపై వైట్ హౌస్ లో గురువారం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.

ప్రధాని నరేంద్రమోదీ.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ పర్యటనలో భాగంగా ఆయన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో.. వీరు ఉగ్రవాదం, దానిలో పాకిస్తాన్ పాత్ర గురించి ప్రస్తావించడం గమనార్హం. దేశంలో ఉగ్రవాద గ్రూపులు పనిచేస్తున్నాయని.. ఇస్లామాబాద్ ప్రభావం పడకుండా చుర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె మోదీని కోరారు.

అమెరికా, భారత దేశ భద్రతపై వైట్ హౌస్ లో గురువారం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సమయంలో వారు ఇండో-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ప్రజా స్వామ్యం, ఆప్ఘనిస్తాన్ , ఇండో-పసిఫిక్ కు ఉన్న ముప్పులతో సహా అన్ని ప్రపంచ సమస్యలపై వీరు చర్చ జరపడం గమనార్హం.

తీవ్రవాదం సమస్య వచ్చినప్పుడు.. ఈ విషయంలో పాకిస్తాన్ పాత్ర గురించి ప్రస్తావించారని విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ శృంగ్లా తెలిపారు. ఉగ్రవాదం లో పాకిస్తాన్ పాత్ర ఎంత వరకు ఉండవచ్చని కమలాహ్యారిస్ మోదీని ప్రశ్నించడం గమనార్హం.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమెరికా భద్రత, భారతదేశ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా పాకిస్తాన్ ని కోరడం గమనార్హం. అనేక దశాబ్దాలుగా భారత్ తీవ్రవాదం బారినపడిందని మోదీతో సమావేశం తర్వాత ఆమె అంగీకరించడం గమనార్హం.