తల్లిని పెళ్లిచేసుకోవడానికి.. కొడుకుని కిడ్నాప్ చేశాడు

Delhi woman denies to marry, lover kidnaps her 4-yr-old son to threaten her
Highlights

ప్రియుడి దారుణం

 వివాహితను పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి.. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేశాడు. ఈ కారణం చూపించి ఆమెను బెదిరించి.. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే పథకం పన్నాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని మధు విహార్  లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీలోని మధువిహార్ ప్రాంతానికి చెందిన ఓ వితంతువు తన నాలుగేళ్ల కుమారుడితో జీవనం సాగిస్తోంది. ఆమెకు ఢిల్లీకి చెందిన శివకుమార్ అనే వ్యక్తితో పరిచయమయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో శివకుమార్ ఆ మహిళను పెళ్లి చేసుకోవాలని భావించాడు. కాగా అతని  ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. 

దీంతో మహిళ ఇంటికి వచ్చిన శివకుమార్ ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు ఆమె నాలుగేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేర పోలీసులు దర్యాప్తు చేయగా బాబుతోపాటు శివకుమార్ కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో ఉన్నాడని తేలడంతో పోలీసులు దాడి చేసి బాబును రక్షించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి మహిళను పెళ్లాడేందుకే ఆమె కుమారుడిని కిడ్నాప్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 

loader