పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 42కి చేరింది. కర్ఫ్యూ, 144 సెక్షన్లతో పాటు భారీగా పోలీసులు మోహరించడంతో అల్లర్లు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి.

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కాలిపోయిన వాహనాలు, ఇటుకలు, రాళ్లు, కూల్‌డ్రింక్‌ సీసాలే కనిపిస్తున్నాయి. సాధారణ పరిస్ధితులు నెలకొంటున్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు సాయంతో మున్సిపల్ అధికారులు క్లీనింగ్ పనులు చేపట్టారు.

Also Read:అల్లర్లు: ఢిల్లీ కొత్త పోలీస్ బాస్ గా శ్రీవాస్తవ, అమూల్య ఔట్

ఘర్షణల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు కవాతును నిర్వహించారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 106 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 18 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఢిల్లీలో చెలరేగిన హింసపై పెద్ద యెత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ గా శ్రీవాస్తవ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అమూల్య స్థానంలో ఆయన కొత్త పోలీసు బాస్ గా వస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్ గా పనిచేస్తారు.

Also Read:ఢిల్లీ అల్లర్లు: ఐబీ అధికారి హత్య.. పోస్ట్ మార్టంలో ఏంతేలిందంటే...

సీఎఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింస నేపథ్యంలో ఆయనను కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఆర్పీఎఫ్) నుంచి తెచ్చి శాంతిభద్రతల ప్రత్యేక కమిషనర్ గా నియమించారు. ప్రస్తుత పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ రేపు శనివారం పదవీ విరమణ చేస్తున్నారు. అమూల్య స్థానంలో శ్రీవాస్తవ పోలీసు కమిషనర్ బాధ్యతలు నిర్వహించనున్నారు.