దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా..  ఆయన మృతదేహానికి చేసిన పోస్ట్ మార్టంలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆయనను ఎంత కిరాతకంగా హత్య  చేశారో తెలిసి అధికారులు కూడా షాకయ్యారు.

Also Read ఢిల్లీ అల్లర్లు: మురికి కాలువలో నిఘా విభాగం అధికారి మృతదేహం.

ఆయన శరీరంలో పలు చోట్ల గాయాలున్నాయని పోస్టుమార్టం చేసిన వైద్యులు చెప్పారు. పదునైన ఆయుధంతో శరీరం లోపల చాలా లోతుగా గాయం చేశారని.. పలుమార్లు పొడిచి మరీ హత్య చేశారని వారు చెప్పారు. ఆయనను హత్య చేసిన తర్వాత  డ్రైనేజీలో పడేసి మరీ  అల్లరిమూకలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

కాగా.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో అంకిత్ శర్మ 2017లో సెక్యూరిటీ అసిస్టెంట్ గా విధుల్లో చేశారు.  ఇటీవల ఆయన ఆఫీసుకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా హత్యకు గురయ్యాడు. చాంద్ బాగ్ లో ఆయనను అల్లరిమూకలు చుట్టుముట్టి.. అత్యంత కిరాతకంగా హత్య చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా... ఈ అల్లర్ల కారణంగా ఢిల్లీలో ఇప్పటి వరకు 38మంది ప్రాణాలు కోల్పోయారు.