న్యూఢిల్లీలో 26 ఏళ్ల  మహిళను హత్య చేసి  బీరువాలో దాచిపెట్టారు.  మృతదేహన్ని కాళ్లు, చేతులు  కట్టి ఆ బీరువాలో  ఉంచారు. ఢిల్లీలోని గోకల్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో 26 ఏళ్ల మహిళను హత్య చేసి బీరువాలో దాచిపెట్టారు. మృతదేహన్ని కాళ్లు, చేతులు కట్టి ఆ బీరువాలో ఉంచారు. ఢిల్లీలోని గోకల్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది. మహిళపై హత్యకు ముందు అత్యాచారం జరిగిందా లేదా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఢిల్లీలోని గోకల్‌పురి ప్రాంతంలో బీరువాలో మహిళ మృతదేహం ఉన్న విషయాన్ని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్య అతనే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫోన్ చేసిన వ్యక్తికి పెళ్లై నలుగురు పిల్లలున్నారు. అయితే తన భార్యను ఎవరో హత్య చేసి బీరువాలో ఉంచారని పోలీసులకు చెప్పాడు. కానీ, ఆ తర్వాత పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. తొలుత తన భార్యగా చెప్పిన ఆ వ్యక్తి.... మృతురాలు తనకు తెలిసిన వ్యక్తిగా మాట మార్చాడు. అంతేకాదు తనకు స్నేహితురాలు అని చెప్పాడని పోలీసులు చెబుతున్నారు.

మృతురాలు గోకల్‌పురిలోని చాంద్‌ భాగ్‌ ప్రాంతంలో ఒక గదిలో నివసిస్తోంది. స్థానికంగా ఓ కంపెనీలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తోందని పోలీసులు వెల్లడించారు. మహిళ హత్య జరిగి 36గంటలు దాటి ఉంటుందని తెలిపారు. ఆ మహిళకు, తాము అదుపులోకి తీసుకున్న వ్యక్తికి సంబంధం ఏంటనే విషయంపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు.