కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం పాటు విద్యా సంస్థలు బంద్ చేయాలని నిర్ణయించింది. అలాగే రేపటి నుంచి నగరంలో నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించింది.
కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం పాటు విద్యా సంస్థలు బంద్ చేయాలని నిర్ణయించింది. అలాగే రేపటి నుంచి నగరంలో నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించింది. దేశంలోనే కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 పాయింట్లు దాటింది. సుప్రీం ఆదేశాలతో తక్షణ చర్యలు తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం.
కాగా.. దేశ రాజధాని Delhi, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై సుమారు వారం రోజుల నుంచి వాయు కాలుష్యం దుప్పటి కప్పేసినట్టే ఉన్నది. Air Pollution తీవ్రతకు కొంత దూరంలోని వస్తువులేవీ కనిపించడం లేదు. దుమ్ము, దూళి, కలుషిత ఉద్గారాలు గాలిలో చేరి ఢిల్లీలో జీవించే పరిస్థితులను దుర్భరం చేస్తున్నాయి. ఇంటిలోనూ మాస్కులు ధరించే పరిస్థితికి చేరుకున్నామని స్వయంగా Supreme Court ప్రధాన న్యాయమూర్తే జస్టిస్ NV Ramana వాపోవడం దుస్థితికి అద్దం పడుతున్నది. కాలుష్య నియంత్రణకు సోమవారం కల్లా Emergency Planతో రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు. ‘ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంత తీవ్రతగా ఉన్నదో అర్థమవుతున్నదా?.. ఇంటిలోనూ మాస్కులు ధరిస్తున్నాం’ అని అన్నారు. ఢిల్లీలో రెండు రోజులు లాక్‌డౌన్ విధించే ఆలోచననూ చేయాలని సూచనలు చేశారు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ALso Read:రెండు రోజులు లాక్‌డౌన్ విధించండి..! ఇంట్లోనూ మాస్క్ ధరించే దుస్థితి.. సుప్రీంకోర్టు మండిపాటు
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేస్తూ 17ఏళ్ల ఢిల్లీ స్టూడెంట్ ఆదిత్య దూబే పిటిషన్ వేశారు. దీన్ని సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారిస్తున్నది. ఈ పిటిషన్‌పై విచారిస్తూ ఢిల్లీలో వాయు ప్రమాణాలను పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటారో కేంద్ర ప్రభుత్వం తెలుపాలని సీజేఐ ఎన్వీ రమణ అడిగారు. ఎలాంటి ఎమర్జెన్సీ ప్రణాళికలు తీసుకుంటారని ప్రశ్నించారు. రెండు రోజుల లాక్‌డౌన్ విధిస్తారా? లేక ఏక్యూఐని తగ్గించడానికి ఏం ప్లాన్‌లు ఉన్నాయని అడిగారు.
ఢిల్లీ గాలిని పీల్చడమంటే.. రోజుకు 20 సిగరెట్లను తాగినట్టేనని, ప్రస్తుత దుస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ కాలుష్యానికి పంజాబ్‌లో పంట నష్టాలను కాల్చివేయడమే ప్రధానమైనట్టుగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా అన్నారు. పంట నష్టాలను కాల్చడకుండా చర్యలు తీసుకుంటున్నామని, కానీ, గత ఐదారు రోజుల నుంచి మరీ ఎక్కువగా కాలుష్యం అక్కడి నుంచి వస్తున్నదని, పంజాబ్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం సరికాదని వాదించారు.
ఈ వాదనను ధర్మాసనం తప్పుపట్టింది. కాలుష్యానికి కేవలం రైతులే కారణమన్నట్టుగా చిత్రిస్తున్నారని, రైతులను విమర్శించడం ఇప్పుడో ఫ్యాషన్ అయిపోయిందని మండిపడింది. పంట నష్టాలే కాదు.. ఢిల్లీలో వాయు ఉద్గారాలు, దుమ్ము, దూళి వంటి అంశాలూ ఉన్నాయి. ఫైర్ క్రాకర్స్, ఇతర విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కాలుష్య నియంత్రణ కోసం చర్యలనే అడుగుతున్నామని, కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా.. అనే తారతమ్యం తమకు లేదని పేర్కొంది. రైతులే కారణమని తాము అనడం లేదని తుషార్ మెహెతా అన్నారు. కాలుష్య నియంత్రణకు అత్యవసర ప్రణాళికతో సోమవారం కోర్టుకు రావాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది.
