కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్ బాగ్ లో నిరసనల సందర్భంగా ఓ వ్యక్తి కాల్పులకు తెగపడిన సంగతి తెలిసిందే. ఆ షూటర్ ఆప్ కార్యకర్త అని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

షూటర్ కపిల్ గుజ్జర్ గత ఏడాది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. షహీన్ బాగ్‌లో ఈ నెల 1న కపిల్ గుజ్జర్ (25) గాలిలోకి కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసును ఢిల్లీ పోలీసు నేర విభాగం దర్యాప్తు చేస్తోంది.

Also Read ప్రతి రోజూ షహీన్ బాగ్ నిరసనకు తల్లితో వచేచ్వాడు: నాలుగేళ్ల బాలుడి మృతి...
 
క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్ దేవ్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ కపిల్ గుజ్జర్, ఆయన తండ్రి ఒక ఏడాది క్రితం ఆప్‌లో చేరినట్లు వెల్లడైందని చెప్పారు. కపిల్ ఫోన్‌లో లభించిన ఫొటోల ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఈ ఫొటోలను పరిశీలించినపుడు ఆప్ నేతలు అతిషి, సంజయ్ సింగ్‌లతో కపిల్ ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఈ విషయాన్ని కపిల్ కూడా వెల్లడించాడని తెలిపారు. ఆయనను రెండు రోజుల రిమాండ్‌కు కోర్టు ఆదేశించినట్లు తెలిపారు.