న్యూఢిల్లీ: సీఏఏకు వ్యతిరేకంగా షహీన్ బాగ్ లో జరుగుతున్న ఆందోళనకు తల్లితో కలిసి నిత్యం నాలుగు నెలల బాలుడు మొహమ్మద్ జహాన్ వచ్చేవాడు. ఈ ప్రదర్శనలో అతను ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలిచాడు. తన చేష్టల ద్వారా ప్రదర్శనకారులకు ఆనందాన్ని పంచుతూ ఉండేవాడు. 

ఇక జహాన్ ఆ ప్రద్శనలో కనిపించడు. తీవ్రంగా జలుబు చేయడంతో అతను గతవారం మరణించాడు. తీవ్రమైన చలి కారణంగా అతనికి జలుబు చేసింది. అయితే తల్లి మాత్రం ప్రదర్శనలో పాల్గొనడానికే నిర్ణయించుకుంది. తన పిల్లల భవిష్యత్తు కోసం తాను ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నట్లు తెలిపింది.

బాట్లా హౌస్ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్స్ తో కప్పిన చిన్నపాటి గుడిసెలో తల్లిదండ్రులు నజియా, మొహమ్మద్ ఆరిఫ్ నివసిస్తూ ఉంటారు. వారికి మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఐదేళ్ల కూతురు, ఏడాది వయస్సు గల కుమారుడు ఉన్నారు.

వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీకి చెందినవారు. ఆరిఫ్ ఎంబ్రాయిడరీ వర్కర్.ఈ రిక్షా డ్రైవర్ గా కూడా పనిచేస్తుంటాడు. భార్య ఎంబ్రాయిడరీ పనిలో అతనికి సాయం చేస్తుంటుంది. 

 నిరసన ప్రదర్శన నుంచి తిరిగి వచ్చిన తర్వాత జహాన్ జనవరి 30వ తేీదన రాత్రి నిద్రలోనే మరణించాడని నజియా కన్నీరుమున్నీరవుతూ చెప్పింది. రాత్రి తాను ఒంటి గంట ప్రాంతంలో ఇంటికి వచ్ిచన పిల్లలను నిద్రపుచ్చానని, తెల్లారి చూసే సరికి జహాన్ లో చలనం లేదని, నిద్రలోనే మరణించాడని వివరించింది.

జహాన్  డిసెంబర్ 18వ తేదీనుంచి ప్రతి రోజూ నిరసన ప్రదర్శనకు వచ్చేవాడు. దాంతో తీవ్రంగా జలుబు చేసి ఊపిరాడక మరణించాడు. ఆస్పత్రి వైద్యులు అతని మృతికి గల కారణాలు తెలియజేయలేదు.