న్యూడిల్లీ: ఏడాది పాటు వివాహేతర సంబంధాన్ని సాగించిన ప్రియురాలిని అత్యంత దారుణంగా హతమార్చాలని ప్రయత్నించాడో పోలీస్ అధికారి. సర్వీస్ రివాల్వర్  తో సదరు మహిలపై కాల్పులు జరపగా తీవ్ర రక్త స్రావంతో రోడ్డుపై పడివున్న ఆమెను మరో ఎస్సై కాపాడి హాస్పిటల్ కు తరలించాడు. ఇలా ఓ ఎస్సై మహిళ ప్రాణాలు తీయాలని చూడగా మరో ఎస్సై ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన దేశ రాజధాని న్యూడిల్లీలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... డిల్లీలోని లాహిరిగేట్ ఎస్సైగా పనిచేస్తున్నాడు సందీప్. అయితే అతడికి పెళ్లయినప్పటికి భార్యతో విడిపోయాడు. దీంతో తాను పనిచేసే పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఇలా ఏడాది కాలంగా వారిద్దరు సహజీవనం సాగిస్తున్నారు. 

read more  యూపీలో మరో గ్యాంగ్ స్టర్ హతం: ఈసారి ఆక్సిడెంట్ లోనే...

అయితే ఏమయ్యిందో ఏమో గానీ తన ప్రియురాలిపైనే సందీప్ గన్ తో కాల్పులు జరిపి హతమార్చాలని ప్రయత్నించాడు. అయితే అతడి నుండి తప్పించుకున్న ఆమె తీవ్ర రక్తస్రావంతో అలీపూర్ ప్రాంతంలో రోడ్డుపై పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన మరో ఎస్సై కాపాడి సమీపంలోని హాస్పిటల్ కు తరలించి ప్రాణాలు కాపాడాడు. 

ప్రస్తుతం బాధిత మహిళ హాస్పిటల్ లో కోలుకుంటోంది. ఆమె ఫిర్యాదు మేరకు కాల్పులు జరిపిన ఎస్సై సందీప్ పై హత్యాయత్నం కేసును నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని డిల్లీ పోలీసులు తెలిపారు.