Asianet News TeluguAsianet News Telugu

శ్రద్ధా వాకర్ హత్య కేసు : పోలీసులకు సవాల్ గా మారిన సాక్ష్యాల సేకరణ..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో సాక్ష్యాలు సేకరించడం పోలీసులకు ఛాలెంజింగ్ గా మారింది. 

Delhi Police face  challenges in Shraddha murder case that is tracing weapon, victim's mobile and clothes
Author
First Published Nov 17, 2022, 1:39 PM IST

ఢిల్లీ : ఢిల్లీ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన ప్రియురాలిని కోసి, ఢిల్లీలో పలుచోట్ల విసిరినట్లు నిందితుడే విచారణలో అంగీకరించాడు. తాజాగా వెలుగులోకి వస్తోన్న విషయాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ కేసు గురించి ఇప్పటికే అన్ని వివరాలు ఉన్నప్పటికీ.. దానిని నిరూపించే సాక్ష్యాధారాలను సేకరించడం పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారింది. మరోపక్క నేటితో నిందితుడు ఆఫ్తాబ్ కస్టడీ గడువు ముగిసిపోనుంది. కోర్టు మరికొన్ని రోజులు అతడిని కస్టడీకి ఇస్తుందని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ సాక్ష్యాలే కావాల్సింది.. 
- మృతురాలు శ్రద్ధావాకర్ ను అఫ్తాబ్ అమీన్ పూనావాలా హత్య చేసి, ముక్కలుగా కోసేందకు వాడిన ఆయుధాన్ని ఇంతవరకు పోలీసులు గుర్తించలేదు. ఒక హత్యను నిరూపించే విషయంలో ఆయుధం అత్యంత కీలకం. హత్య జరిగి ఇప్పటికి ఆరు నెలలవుతుంది. ఒకవేళ దానిని స్వాధీనం చేసుకున్నా.. దాని మీద రక్తపు మరకలు, వేలిముద్రలు గుర్తించడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. 

- మృతి చెందిన సమయంలో శ్రద్ధా వేసుకున్న దుస్తులను కనుగొనాల్సి ఉంది. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ దుస్తులను అతడు చెత్త వ్యాన్ లో వేశాడు. ఇప్పుడు వాటిని గుర్తించడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది. 

శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు : కూతుళ్లపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి.. సంబంధం లేదని చెప్పినా సరే.. కిరణ్ బేడీ

- మరో కీలక సాక్ష్యం మొబైల్ ఫోన్. అది కూడా దొరకలేదు. హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇది అత్యంత కీలకం. లాగిన్ హిస్టరీని బట్టి ఆమె చివరగా ఉన్న ప్రదేశాన్ని కనుగొనేందుకు వీలవుతుంది. 

- ముక్కలుగా కోసిన శ్రద్ధా శరీర అవయవాలను ఒక ఫ్రిజ్ లో పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కానీ ఆ ఫ్రిడ్జ్ ను హైడ్రో క్లోరిక్ యాసిడ్ తో శుభ్రం చేసినట్లు తెలుస్తోంది. శ్రద్ధా డీఎన్ఏ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు దానిని వాడాడు. ఇప్పుడు దీనినుంచి ఏదైనా ఆధారాన్ని సేకరించే వీలుందో లేదో ఇంకా స్పష్టత లేదు. 

- అలాగే హత్యకు ముందు వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని విచారణలో ఆఫ్తాబ్ వెల్లడించాడు. కానీ, ఆ గొడవ గురించి పొరుగున ఉన్నవారు ఎవరూ వినలేదని తెలుస్తోంది. దాని గురించి ఎవరైనా సమాచారం వెల్లడిస్తే.. ఈ కేసును ఉపకరిస్తుంది. 

- ఇక శ్రద్ధా శరీర అవయవాలను ఢిల్లీలోని అటవీ ప్రాంతంతో పాటు, పలు చోట్ల విసిరినట్లు అఫ్తాబ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అటవీప్రాంతంలో వెతగ్గా ఇప్పటివరకూ 10కి పైగా ఛిద్రమైన భాగాలు దొరికాయి. ఇంకా దొరకాల్సినవి చాలా ఉన్నాయి. ఈ తరమా కేసు దర్యాప్తులో ఎముకలు కీలకం.. హత్య ఎప్పుడు జరిగింది. కారణం ఏమటో తేలే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటికి దొరికినవి శ్రద్ధవేనా? అసలు ఒక మనిషికి సంబంధించినవేనా? అన్న విషయాలు తేలాల్సి ఉంది. 

కీలకంగా మారనున్న వాటర్ బిల్లు..
- ఇంటికి ప్రతినెల ఉచితంగా సరఫరా అయ్యే 20 వేల లీటర్ల కంటే అధికంగా నీటిని అఫ్తాబ్ వినియోగించాడని పోలీసులు గుర్తించారు. శరీర భాగాలను కత్తిరించే శబ్దం వినిపించకుండా ఉండేందుకు ట్యాప్ తిప్పే ఉంచాడని తేలింది. శరీర భాగాలపై ఉన్న రక్తాన్ని కడిగేందుకు, ఇంటిలోని ఆనవాళ్లను చెరిపేందుకు నీటిని ఎక్కువగా వినియోగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో రూ.300 మేర పెండింగ్ బిల్లు వచ్చిందన్నారు. ఇది కేసులో కీలకంగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు. 

- ఉచిత నీటి సరఫరాతో అక్కడ ఉన్న అన్ని ఇళ్లకు దాదాపు జీరో బిల్లు వస్తుంది. వారు అద్దె నిమిత్తం ఆ ఇంటికి మే 14న వచ్చారు. ‘అంత వాటర్ బిల్లు రావడం ఆశ్చర్యంగా ఉంది. ప్రతి నెలా సరిగ్గా అద్దె కట్టేవాడు. దాంతో నాకు వారి ఫ్లాట్ కు వెళ్లాల్సిన అవసరం రాలేదు’ అని యజమాని వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios