Asianet News TeluguAsianet News Telugu

శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు : కూతుళ్లపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి.. సంబంధం లేదని చెప్పినా సరే.. కిరణ్ బేడీ

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ శ్రద్ధావాకర్ మర్డర్ మీద పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. తల్లిదండ్రులు ముందుగా గమనించాల్సిందంటూ కామెంట్ చేశారు. 

Parents must keep track of their daughters: Kiran Bedi on Shraddha's murder
Author
First Published Nov 16, 2022, 2:02 PM IST

ఢిల్లీ : పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యపై స్పందించారు. అమ్మాయిలు తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినా సరే.. వారు తమ కూతుళ్ళపై నిఘా ఉంచాలని అన్నారు. ఈ కేసులో తల్లిదండ్రులు తమ కూతురు గురించి ఆలస్యంగా ఆరా తీశారని అన్నారు. శ్రద్ధ తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అన్నారు. ఈ ఘటనకు ఇరుగు పొరుగు వారు, ఆమె నివసించే ఫ్లాట్ యజమాని కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. 

దీనివల్ల మొత్తం కుటుంబం నష్టపోయిందని ఆమె అన్నారు. ఇది సమాజ వైఫల్యం అని.. స్నేహితులు కూడా విఫలం అయ్యారని కిరణ్ బేడీ అన్నారు. అమ్మాయిలకు భరోసా ఇవ్వడంలో కుటుంబం పాత్ర ముఖ్యమని తెలిపారు. డేటింగ్ యాప్ లో ఆఫ్థాబ్ ఎంతగా నిమగ్నమయి వున్నాడో అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని, ఓ రకంగా నేరానికి దారితీసిన పరిస్థితులను శ్రద్ధా చూసిందని ఆమె చెప్పారు. అమ్మాయిలు ధైర్యంగా ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని.. జీవితంలో ఛాలెంజెస్, రియాలిటీల గురించి తల్లిదండ్రులు చెప్పాలని అన్నారు. 

ప్రియురాలి శవం ఫ్రిడ్జ్ లో ఉండగానే.. మరో యువతిని ఇంటికి పిలిచి డేటింగ్.. క్రైం సిరీస్ చదివి శరీరం ముక్కలు...

ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రేయసి శ్రద్ధా వాకర్ ని, ఆఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్యచేశాడు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత ఈ భయంకరమైన నేరం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి 18 రోజుల పాటు రాత్రిపూట ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పడేశాడు. 2019నుంచి రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరు సొంత నగరం ముంబైని వదిలి ఢిల్లీలో నివాసముంటున్నారు. మే 18 పెళ్లి గురించి ఇద్దరి మధ్య గొడవ కావడంతో శ్రద్ధను గొంతు కోసి చంపాడు. ఆరు నెలల తర్వాత తన కూతురు కనిపించడం లేదని శ్రద్ధ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి.. 35 ముక్కలుగా కోసి, నగరమంతా చల్లి...

ఆఫ్తాబ్ చెప్పిన వివరాల మేరకు అడవిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఇప్పటివరకు శ్రద్ధ మృతదేహంలోని సుమారు 12 ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె తల మాత్రం ఇంకా లభించలేదని మంగళవారం తెలిపారు. పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న మృతదేహం ముక్కలు శ్రద్ధావి కాదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఆఫ్తాబ్ తో కలిసి మంగళవారం మెహ్రౌలీ అడవుల్లోకి వెళ్లిన పోలీసులు అక్కడ సుమారు రెండున్నర గంటలపాటు సోదాలు నిర్వహించారు. విచారణలో ఆఫ్తాబ్ పదే పదే వాంగ్మూలాన్ని మారుస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios