నకిలీ యాప్‌లతో ప్రజలను మోసం చేస్తున్న చైనా ముఠాను న్యూఢిల్లీ పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు.  

న్యూఢిల్లీ: నకిలీ యాప్‌లతో ప్రజలను మోసం చేస్తున్న చైనా ముఠాను న్యూఢిల్లీ పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. నకిలీ యాప్ ల ద్వారా సుమారు 5 లక్షల మందిని ఈ ముఠా మోసగించిందని పోలీసులు తెలిపారు. పవర్ బ్యాంక్, సన్ ఫ్యాక్టరీ,ఏజ్‌ప్లాన్ వంటి యాప్ ల ద్వారా ప్రజలను మోసం చేశారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ ముఠాను అరెస్ట్ చేసినట్టుగా ఢిల్లీ సైబర్ సెల్ డీసీపీ అన్వేష్ రాయ్ ప్రకటించారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

also read:హైద్రాబాద్‌ పోలీసులకు ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల బురిడీ: కోటిన్నర నగదు డ్రా

also read:ఆన్‌లైన్ యాప్‌లతో రూ. 11 వేల కోట్ల ఆర్జన: చార్జీషీట్‌లో పోలీసులు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ లోన్ యాప్ ల ద్వారా చైనా కు చెందిన కొందరు పెద్ద మొత్తంలో డబ్బులను చైనాకు తరలించాలరు. ఈ మేరకు తెలంగాణకు చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో చార్జీషీట్ ను కూడ పోలీసులు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలకసూత్రధారి జెన్నీఫర్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. లోన్ యాప్ తరహలోనే ఫేక్ యాప్ లను తయారు చేసి డబ్బులు దండుకోవడంలో ఈ చైనా ముఠాపై అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.