Asianet News TeluguAsianet News Telugu

శృంగారం అని తెలియక.. 16యేళ్ల అక్క మీద 12 యేళ్ల బాలుడు అత్యాచారం..! గర్భం దాల్చడంతో....!!

ఢిల్లీలో దారుణం జరిగింది. తెలిసీ తెలియని వయసులో సొంత అక్కతోనే శృంగారంలో పాల్గొన్నాడో 12యేళ్ల బాలుడు. పర్యవసానంగా ఆ అక్క గర్భం దాల్చింది. అయినా ఆ విషయం వారికి తెలియలేదు. మనసును మెలిపెట్టి, జుగుస్స కలిగించే ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది.

Delhi-NCR shocker: 12-year-old boy rapes, impregnates teen sister - bsb
Author
Hyderabad, First Published Jul 7, 2021, 4:35 PM IST

ఢిల్లీలో దారుణం జరిగింది. తెలిసీ తెలియని వయసులో సొంత అక్కతోనే శృంగారంలో పాల్గొన్నాడో 12యేళ్ల బాలుడు. పర్యవసానంగా ఆ అక్క గర్భం దాల్చింది. అయినా ఆ విషయం వారికి తెలియలేదు. మనసును మెలిపెట్టి, జుగుస్స కలిగించే ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది.

శృంగారం అంటే ఏంటో తెలియని వయసులో దానిమీద ఆసక్తి పెంచుకోవడమే కాదు.. పలుసార్లు సొంత అక్కాతమ్ముళ్లే శృంగారం చేయడంతో ఆ అక్క గర్భం దాల్చింది. ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అక్కాతమ్ముళ్ల తల్లిదండ్రులిద్దరూ నొయిడాలోనే చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. తండ్రి నిర్మాణ కూలీగా, తల్లి పనిమనిషిగా పనిచేస్తున్నారు. 

లాక్ డౌన్ తో స్కూల్స్ మూత పడడం, ఆన్ లైన్ పేరుతో చేతుల్లోకి మొబైల్స్ రావడం.. దీనికి తోడు ఒంటరితనం పిల్లలిద్దరికీ కావాల్సినంత స్వేచ్ఛనిచ్చింది. 12 యేళ్ల బాలుడు, 16 యేళ్ల అక్కతో శృంగారంలో పాల్గొన్నాడు. అలా ఒక్కసారి కాదు పలుసార్లు జరిగింది. 

శృంగారం వల్ల గర్భం వస్తుందన్న విషయం కూడా వీరికి తెలియలేదు. కొద్ది రోజులకు ఆ బాలిక పొట్ట ఎత్తుగా ఉండడాన్ని ఆమె తల్లి పనిచేస్తున్న ఇంటి యజమాని గుర్తించింది. వియమేంటని అడిగితే.. తనకు తెలియదని కడుపు ఉబ్బుతోందని ఆ బాలిక సమాధానం చెప్పింది.

దీంతో ఆమెకు అనుమానం వచ్చి బాలికను కూర్చోబెట్టి.. అన్ని విషయాలూ అడగ్గా ఆ బాలిక అసలు విషయం చెప్పింది. మూడు నెలల కిందట తన తమ్ముడు, తాను శృంగారంలో పాల్గొన్నామని చెప్పింది. దీంతో షాక్ అయిన ఆమె చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి, పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేసింది. 

తమ కూతురు పొట్ట ఎత్తుగా ఉన్నట్లు తల్లిదండ్రులు గమనించినా, అదేదో ఇన్ఫెక్షన్ అనుకున్నారు కానీ సీరియస్ గా తీసుకోలేదు. అక్కాతమ్ముళ్లే శృంగారంలో పాల్గొన్నారని తెలిసి.. వారు దాన్ని జీర్ణించుకోలేక షాక్ లో ఉండిపోయారు. 

దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని జువెనైల్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించి అక్కడ్నుంచి జువైనల్ షెల్టర్ కు తరలించారు. బాలికను హాస్పిటల్ కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios