Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ మెట్రోలో రంగులు చల్లుకున్న యువతులు: స్పందించిన అధికారులు

ఢిల్లీ మెట్రో రైలులో  ఇద్దరు యువతులు రంగులు చల్లుకున్న వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోపై  నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Delhi Metro Responds After Video Of Girls Playing Holi On Train Goes Viral lns
Author
First Published Mar 25, 2024, 7:21 AM IST

 న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలులో ఓ హిందీ సినిమా పాటకు  అనుగుణంగా ఇద్దరు యువతులు రంగులు చల్లుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోపై  ఢిల్లీ మెట్రో రైలు అధికారులు స్పందించారు. ఈ వీడియోను టెక్నాలజీని ఉపయోగించి రూపొందించారా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.ఈ వీడియోను విశ్లేషిస్తున్నట్టుగా ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్  ప్రకటించింది.  ఢిల్లీ మెట్రో రైలు నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఈ వీడియో ఉందని అధికారులు ప్రకటించారు.

ఢిల్లీ మెట్రో రైలులోని ఓ కోచ్ లో  కింద కూర్చున్న ఇద్దరు మహిళలు రంగులు చల్లుకుంటున్నట్టుగా వీడియోలో దృశ్యాలున్నాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి  తయారు చేశారా అనే అనుమానాన్ని ఢిల్లీ మెట్రో రైలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించవద్దని  ప్రయాణీకులను  మెట్రో రైలు అధికారులు కోరారు.ఈ విషయమై  ప్రయాణీకుల్లో అవగాహన కల్పించేందుకు  అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు.ఇతర ప్రయాణీకులకు  అసౌకర్యం కల్గించేలా  రీల్స్ లేదా  ఇతర  కార్యక్రమాలు నిర్వహించవద్దని కూడ అభ్యర్ధించిన విషయాన్ని  ఢిల్లీ మెట్రో రైలు అధికారులు గుర్తు చేశారు.ఇలా ఎవరైనా చేస్తే తమ దృష్టికి తీసుకు రావాలని  కోరుతున్నారు  ఢిల్లీ మెట్రో రైలు అధికారులు.

 

పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఇద్దరు యువతులు రంగులు చల్లుకుంటున్న వీడియోపై  పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ వీడియో చూసి తాను సిగ్గుపడుతున్నట్టుగా  ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.  ఈ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరో నెటిజన్ కోరారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios