Asianet News TeluguAsianet News Telugu

మెట్రోలో అదిరిపోయే స్టంట్ చేసిన యువతి.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..

మెట్రో వీడియోలు చిత్రీకరించడంపై నిషేధం గురించి పదేపదే రిమైండర్‌లు చేసినప్పటికీ, కొంతమంది ప్రయాణికులు వీడియోగ్రఫీలో మునిగిపోతూనే ఉన్నారు. తాజాగా ఓ యువతి మెట్రోలో స్టంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Delhi Metro Another Video Went Viral Young Girl Did Stunt KRJ
Author
First Published Aug 20, 2023, 5:50 PM IST

ప్రస్తుతం చాలా మందికి సోషల్ మీడియా ఫీవర్ పట్టుకుంది. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ లో ఫేమస్ కావాలని చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు.  ఏవేవో పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడ ఎలా ఉండాలో.. అసలూ తాము ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి  ఢిల్లీ మెట్రో వేదికగా మారింది. తరుచు ఏదొక సంఘటనతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే చాలామంది మెట్రోలో వీడియోలు చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సందర్భాలున్నాయి.

ఈ క్రమంలో ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం అధికారుల ద్రుష్టికి వెళ్లడంతో మెట్రోలో వీడియోలు చిత్రీకరించారదని మెట్రో (డీఆర్ఎంసీ) అధికారులు పదేపదే హెచ్చరిస్తునే ఉన్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు ఎన్ని సార్లు హెచ్చరించినా.. యువత మాత్రం  పట్టించుకోవడం లేదు. వారి బుద్దిమాత్రం మారడం లేదు. ఇదిలాఉంటే.. తాజాగా ఓ మహిళ  మెట్రోలో స్టంట్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.  

వివరాల్లోకెళ్తే.. మిషా శర్మ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ మెట్రో రైలులో ప్రయాణం చేస్తూ.. ఉంది ఉన్నట్టుగా అందరూ ఆశ్చర్యపోయే స్టంట్ చేసింది. ఉన్న దగ్గరనే ఒక్కసారిగా పల్టీ కొట్టి కొట్టింది. ఆ స్టంట్ చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోతారు. కొందరు ఆమెను చూసి నవ్వుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 5.2 లక్షల మంది  వీక్షించగా.. 45,000 లైక్‌లు వచ్చాయి. అదే సమయంలో కామెంట్లు వెల్లువెత్తున్నాయి. "యు ఆర్ ది బెస్ట్" అని ఒక యూజర్ కామెంట్ చేయగా.."అద్భుతం" అని మరొక వ్యక్తి  కామెంట్ చేశాడు. మీరు చాలా మంచి జిమ్నాస్ట్, బహిరంగ ప్రదేశాల్లో మీ సమయాన్ని, శక్తిని వృధా చేయకుండా ఒలింపిక్స్‌లో భారతదేశం తరుపున పాల్గొనండి అంటూ మరికొందరూ సలహా ఇస్తున్నారు. 

 
ఇలాంటి వీడియో వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఢిల్లీ మెట్రో ప్రాంగణంలో రీల్స్ చిత్రీకరణ వివాదాలకు దారితీసింది. ఈ విషయం అధికారుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ సంవత్సరం ప్రారంభంలో.. ఢిల్లీ మెట్రో రైళ్లలో వీడియోలను చిత్రీకరించవద్దని ప్రయాణికులను హెచ్చరించింది. మెట్రో ప్రయాణీకులకు  ఇబ్బంది కలిగించవద్దని పేర్కొంది. ప్రయాణికులందరూ తమ ప్రవర్తన తోటి ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వ్యవహరించాలని సూచించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios