ఢిల్లీలో ఓ యువకుడు వివాహితను దగ్గరి నుంచి తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం, ఇంటికి వెళ్లాడు. కేసు నమోదు చేసి ఆ యువకుడి ఇంటికి వెళ్లగానే ఇంటిపైన నిందితుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ నేరం చోటుచేసుకుంది. జిమ్‌లో పరిచయమైన వివాహితను ఓ యువకుడు ఆమె ఇంటికి వెళ్లి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం. సీసీటీవీ ఫుటేజీల సహకారంతో నిందితుడిని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆ నిందితుడికి ఇంటికి వెళ్లగానే.. ఇంటి పైకప్పు ఎక్కిన నిందితుడు తనను తాను అదే తుపాకీతో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నైరుతి ఢిల్లీలోని దాబ్రి ఏరియాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. 42 ఏళ్ల రేణు గోయల్ దాబ్రి పోలీసు స్టేషన్ ఏరియాలోని వైశాలి ఏరియాలో నివసిస్తున్నది. ఆమె భర్త బిల్డర్. గురువారం రాత్రి 25 ఏళ్ల ఆశిష్ వెళ్లాడు. ఆమె ఇంటి వద్దనే తుపాకీతో రేణును కాల్చి చంపేశాడు. సుమారు 8.45 గంటల ప్రాంతంలో తమకు ఈ విషయం తెలిసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు డీసీపీ (ద్వారక) ఎం హర్షవర్ధన్ చెప్పారు.
స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీనీ పరిశీలించారు. రేణు గోయల్‌ను అశిష్ అతి దగ్గరి నుంచే కాల్చేశాడు. ఈ నేరం ఒక్క యువకుడే పాల్పడినట్టు స్థానికులు చెప్పారు. ఆమె వద్దకు ఆ యువకుడు వెళ్లడాన్ని తాము చూశామని, ఆమె షూట్ చేసిన తర్వాత కూడా యువకుడు వెళ్లిపోవడాన్ని చూశామని పోలీసులకు స్థానికులు వెల్లడించారు. రక్తపు మడుగులో నేలపై పడిపోయిన రేణు గోయల్‌ను స్థానికులు గమనించారు. వెంటనే ఆమెను సమీప హాస్పిటల్ తరలించారు. కానీ, ఆమె అప్పటికే మరణించినట్టు చెప్పారు.
ఆ ఏరియాకు సమీపంలోనే తన తల్లిదండ్రులతో నివసిస్తున్న నిందితుడి ఇంటికి పోలీసులు వెళ్లారు. తాము వారి ఇంటికి వెళ్లగానే టెర్రస్ పై ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఇద్దరి మరణాలకు ఉపయోగించిన కంట్రీ మేడ్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆశిష్, రేణులు కొన్నేళ్ల క్రితం ఓ జిమ్‌లో పరిచయం అయినట్టు డీసీపీ హర్షవర్ధన్ వివరించారు. వారి మిత్రులు, కుటుంబాలను విచారించి ఈ ఘటనకు గల వివరాలను తెలుసుకుంటామని చెప్పారు.
