అక్రమ సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్య, కోడలిని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన సతీష్ చౌదరి(62).. టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. కాగా... ఆయనకు భార్య స్నేహలతా చౌదరి, కొడుకు గౌరవ్ చౌదరి, అతని భార్య ప్రగ్యా చౌదరి(35), మరో కుమారుడు సౌరబ్ చౌదరి అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. కాగా.. గౌరవ్ చౌదరి సింగపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

వీళ్లంతా ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కాగా... సతీష్ చౌదరికి ... భార్య స్నేహలతా చౌదరి, కోడలు ప్రగ్యా చౌదరిలు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే అనుమానం ఉంది.

ఈ క్రమంలో.. ఇంట్లో ఉన్న భార్య, కోడలిని కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. కాగా... తండ్రి దాడి నుంచి తల్లిని, వదినను కాపాడటానికి సౌరబ్ చాలా ప్రయత్నించాడు. కానీ... కాపాడలేకపోయాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.