Asianet News TeluguAsianet News Telugu

ఆసియాలోని 10 అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ లేదు - సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో గతంతో పోలిస్తే ఇప్పుడు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ  ప్రజలు కాలుష్యం తగ్గించేందుకు చాలా కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. 

Delhi is not among the 10 most polluted cities in Asia - CM Arvind Kejriwal
Author
First Published Oct 24, 2022, 3:24 PM IST

ఆసియాలోని 10 అత్యంత కాలుష్య నగరాల్లో భారత్‌కు చెందిన ఎనిమిది నగరాలు ఉన్నాయని, కానీ ఆ జాబితాలో ఢిల్లీ లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ రిపోర్ట్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. కొన్నేళ్ల కిందట ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీని ఒకటిగా పరిగణించేవారని అన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. అయితే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఆయన అన్నారు.

చెన్నైలో భారీ అగ్నిప్రమాదం.. డ్రగ్స్ కంపెనీలో చెలరేగిన మంటలు..

‘‘ ఢిల్లీ ప్రజలు చాలా కష్టపడి పని చేశారు. ఈరోజు మనం చాలా అభివృద్ధి చెందాం. అయినా ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో స్థానం సంపాదించేందుకు మనం కష్టపడి పని చేస్తూనే ఉంటాం ’’ అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీవాసుల నిరంతర ప్రయత్నాల కారణంగా కాలుష్యం తగ్గుముఖం పట్టిందని, ఢిల్లీని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం ఉదయం 6 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)తో 'చాలా పేలవమైన' కేటగిరీకి చేరుకుంది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల వచ్చే ఉద్గారాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. ఆనంద్ విహార్‌లోని ఒక స్టేషన్ 'తీవ్రమైన' కాలుష్య స్థాయి నివేదించింది. ఘజియాబాద్ ఏక్యూఐ 300, నోయిడా 299, గ్రేటర్ నోయిడా 282, గురుగ్రామ్ 249, ఫరీదాబాద్ 248 నమోదు అయ్యింది. 

ఆదివారం సాయంత్రం ఢిల్లీ సిటీ 24-గంటల సగటు వాయు నాణ్యత సూచిక (AQI) 259ని నివేదించింది. ఇది ఏడేళ్లలో దీపావళి ముందు రోజు కనిష్ట స్థాయి. అయినప్పటికీ దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు పటాకులు పేల్చడంతో ఉష్ణోగ్రత, గాలి వేగం తగ్గుదలతో రాత్రిపూట కాలుష్య స్థాయిలు పెరిగాయి. అలాగే వ్యవసాయ మంటల సంఖ్య 1,318కి పెరిగింది. ఇది ఈ సీజన్ లో ఇప్పటివరకు అత్యధికం.

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖానుకు కోర్టులో ఎదురుదెబ్బ !

కాగా.. ఒకవేళ గతేడాది లాగా ఈ సారి కూడా పటాకులు పేలితే దీపావళి రోజు రాత్రి గాలి నాణ్యత ‘‘తీవ్రమైన’’ స్థాయికి పడిపోవచ్చు. మరో రోజు ‘‘రెడ్’’ జోన్‌లో కొనసాగవచ్చని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR ) అంచనా వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios