ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వీకేండ్ కర్ఫ్యూను విధించింది ప్రభుత్వం. ప్రైవేట్ సంస్థలు 50 శాతంతో కార్యాలయాలను నిర్వహించుకోవచ్చని సూచించింది.
న్యూఢిల్లీ: Corona ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో వీకేండ్ కర్ఫ్యూను విధించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ కార్యాలయాలు, అవసరమైన సేవలను మినహాయించి ఇంటి నుండి పనిచేసేందుకు ప్రైవేట్ కార్యాలయాలకు 50 శాతంతో పనిచేసేందుకు అనుమతించారు.ఇవాళ రాత్రి నుండి కొత్త ఆంక్షలు అనుమతించనున్నట్టుగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన ఇవాళ డిడిఎంఏ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించారు.
శుక్రవారం నాడు రాత్రి 10 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించారు. అనవసరంగా ఇంటి నుండి బయటకు వెళ్లడానికి నిషేధం విధించింది. అత్యవసర సేవలతో వ్యవహరించే ప్రభుత్వ కార్యాలయాలు ఇంటి నుండి పనిచేస్తాయని తెలిపింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి కరోనా సోకింది. దీంతో ఆయన ఐసోలేషన్ కి వెళ్లారు. రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి పెరిగిపోతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకొంది.
also read:ఒమిక్రాన్ ఎఫెక్ట్: పంజాబ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు
ఒమిక్రాన్ వ్యాప్తి ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పెరిగింది. నిన్న ఒక్క రోజే 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీరేటు 6.46 శాతానికి చేరింది. గత ఏడాది మే తర్వాత కరోనా పాజిటివిటీ రేటు ఇంత ఎక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. వరుసగా రెండు రోజులుగా కరోనా కేసుల పాజిటివిటీ రేటు 5 శాతంగా నమోదు కావడంతో వీకేండ్ కర్ప్యూను విధించాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఢిల్లీలో ప్రజా రవాణ వ్యవస్థపై మరిన్ని ఆంక్షలు విధించారు. వివాహలు, ఫంక్షన్లు, అంత్యక్రియల్లో పాల్గొనే వారిపై పరిమితులు విధించారు.అత్యవసర సేవలు మినహా పూర్తిగా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది., మాల్స్, సెలూన్స్ వంటి అత్యవసరం కాని దుకాణాలు మూసివేయనున్నారు. ఇప్పటికే గత ఏడాది డిసెంబర్ 29 నుండి రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ అమలు చేస్తున్నారు. స్కూల్స్, కాలేజీలు, సినిమా థియేటర్లను మూసివేశారు. మెట్రో, బస్సులను 50 శాతం సామర్ధ్యంతో నడపాలని ఆదేశించింది ప్రభుత్వం.
ఢిల్లీలో వచ్చే వారంలో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ వారాంతం నాటికి రోజుకు 8 నుంి 9 వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జనవరి 15 నాటికి కరోనా కేసులు 15 నుండి 20 వేలకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో కూడా రాత్రిపూట కర్ఫ్యూు అమల్లోకి తీసుకొచ్చారు.
పంజాబ్ లో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన తర్వాత ఆ రాష్ట్రం ఇవాళ్టి నుండి రాత్రిపూట కర్ఫ్యూను విధించాలని నిర్ణయం తీసుకొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలను తిరిగి అమల్లోకి తీసుకువస్తున్నాయి. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
