ప్రేమ పెళ్లిళ్లకు అడ్డు చెప్పకూడదు.. ఢిల్లీ హైకోర్టు సంచలనం తీర్పు
Delhi High Court:పెళ్లి పెళ్లిలపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మేజర్లు అయిన యువతీ యువకులు తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉందనీ, వారి నిర్ణయాన్ని తల్లిదండ్రులు గానీ, కుటుంబ సభ్యులు గానీ అడ్డుచెప్పడానికి వీలు లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం.. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉంటుందని తేల్చి చెప్పింది.
Delhi High Court: ప్రేమ పెళ్లిపై ఢిల్లీ హైకోర్టు సంచలనం తీర్పు వెలువరించింది. ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని తెలిపింది. అలాంటి వివాహాలకు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పరాదని తేల్చి చెప్పింది. నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత వాళ్లను విడదీసే హక్కు వారి కుటుంబాలకు లేదని పేర్కొంది. ఇటీవల పెద్దలను ఎదురించి.. తమ కుటుంబాల ఇష్టాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంటకు తమ ఫ్యామిలీ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో వారు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. వారి పిటిషన్‌ని స్వీకరించిన న్యాయస్థానం.. ఆ నవ జంటకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించి, వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఢిల్లీ హైకోర్టు గురువారం సంచలనం తీర్పు
విచారణ సందర్భంగా జస్టిస్ తుషార్ రావు గేదెల మాట్లాడుతూ.. పౌరులకు భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. పిటిషనర్ తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని, ఏ విధంగానూ ఆ వారి వివాహం బలహీనపరచబడదని పేర్కొన్నారు. వాళ్లిద్దరు మేజర్లే కాబట్టి.. వారు చేసుకున్న పెళ్లి చట్టబద్ధమైందేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని జస్టిస్ అన్నారు. వారి ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరని వెల్లడించారు. తన పౌరులకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగ బాధ్యతలో రాష్ట్రం ఉందని పేర్కొన్నారు.
వాస్తవానికి .. ఈ పిటిషన్ దాఖలు చేసిన జంట పెద్దలను ఎదిరించి ఏప్రిల్‌లో వివాహం చేసుకుంది.అప్పటి నుంచి వీళ్లు సంతోషంగానే జీవిస్తున్నారు. అయితే.. ఇటీవల వీరికి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ వాదనలు విన్న తర్వాత కొత్త జంటకు భద్రత కల్పించాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు ఆ జంట పరిస్థితిని తనిఖీ చేయాలని పేర్కొంది.