Asianet News TeluguAsianet News Telugu

పిల్లలపై కోవాగ్జిన్ ట్రయల్స్‌పై స్టేకి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

2 నుండి 18 ఏళ్ల వారిపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ ఇచ్చిన అనుమతిపై స్టే ఇచ్చేందుకు  విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అంతేకాదు ఈ విషయమై డీసీజీఐ, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

Delhi high court refuses to stay Covaxin clinical trial on children aged 2-18, issues notice to DCGI lns
Author
New Delhi, First Published May 19, 2021, 2:23 PM IST

న్యూఢిల్లీ: 2 నుండి 18 ఏళ్ల వారిపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ ఇచ్చిన అనుమతిపై స్టే ఇచ్చేందుకు  విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అంతేకాదు ఈ విషయమై డీసీజీఐ, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 నుండి 18 ఏళ్లలోపు చిన్నారులపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ను డీసీజీఐ అనుమతిచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ  సంజీవ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన  పిల్ పై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది.

also read:భారత్‌పై బయోటెక్‌కు షాక్: పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్ వద్దు... ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

ట్రయల్స్ లో పాల్గొనాల్సిన పిల్లలు తమను తాము వలంటీర్లుగా రిజిస్టర్ చేసుకొంటున్నారని కుమార్  ఆ పిల్ లో  పేర్కొన్నారు. ఈ విషయంలో పిల్లల పేరేంట్స్ అనుమతి కూడ ఆమోదం కాదన్నారు. ఇది చిన్నారుల జీవితానికి సంబంధించిన అంశమని ఆయన చెప్పారు. కరోనా నియంత్రణకు 2 నుండి 18 ఏళ్ల మధ్య వారికి కోవాగ్జిన్ టీకా ఇచ్చేలా భారత్ బయోటెక్ ప్రయోగాలు చేస్తోంది. క్లినికల్ పరీక్షలకు డీసీజీఐ నుండి అనుమతి పొందింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios