పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్‌కు అనుమతినిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఛాలెంజ్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

అయితే 2 నుంచి 18 ఏళ్ల వయసు వారిపై కొవాగ్జిన్ ఫేస్ 2, ఫేస్ 3 ట్రయల్స్‌కి డీసీజీఐ ఇటీవల అనుమతినిచ్చింది. త్వరలో ఈ ట్రయల్స్ ప్రారంభమవుతాయని భారత్ బయోటెక్ తెలిపింది. అయితే ఈ సమయంలో ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు కావడం ఆసక్తికరంగా మారింది. 

Also Read:వ్యాక్సినేషన్ వేగవంతం: కొవాగ్జిన్ ఫార్ములా బదిలీకి కేంద్రం ఓకే..?

రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్షల్లో ఆరోగ్యవంతులైన 525 మంది వాలంటీర్లు పాల్గొంటారని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పిల్లలపై ఈ టీకా ఏమేరకు పనిచేస్తుందో తెలుసుకోడానికి క్లినికల్‌ పరీక్షలు నిర్వహించాలని భారత్‌ బయోటెక్‌ ప్రతిపాదించగా, అందుకు డీసీజీఐ, దానికి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ అంగీకరించిన విషయం తెలిసిందే