Asianet News TeluguAsianet News Telugu

అల్లోపతిపై వ్యాఖ్యలు: చిక్కుల్లో బాబా రామ్‌దేవ్.. నోటీసులు పంపిన ఢిల్లీ హైకోర్టు

అల్లోపతితోపాటు, అల్లోపతి వైద్యులపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై అనేక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం పరువు నష్టం కేసు దాఖలు చేసింది. దీనికి సంబంధించి బాబా రామ్‌దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 

Delhi High Court issues notice to Swami Ramdev over his remarks on allopathy ksp
Author
New Delhi, First Published Jul 30, 2021, 3:29 PM IST

ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసు ఇచ్చింది. కోవిడ్-19కు చికిత్సలో అల్లోపతి విధానాన్ని విమర్శించినందుకు ఆయనపై దాఖలైన పిటిషన్‌ను గాను ఈ చర్య తీసుకుంది. అల్లోపతితోపాటు, అల్లోపతి వైద్యులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇదే వ్యవహారంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం పరువు నష్టం కేసు దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 10న జరుగుతుంది. 

Also Read:రాందేవ్‌బాబా వివాదాస్పద వ్యాఖ్యలు: రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేసిన ఐఎంఏ

కాగా, అల్లోపతిపై రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అప్పట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ హర్షవర్ధన్ జోక్యంతో బాబా రామ్‌దేవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయనకు పంపిన లీగల్ నోటీసులో తన వ్యాఖ్యలను 15 రోజుల్లోగా ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.1,000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. అంతేకాదు రామ్‌దేవ్ బాబాపై పాట్నా, రాయ్‌పూర్‌లలో కూడా ఫిర్యాదులు దాఖలయ్యాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios