ఐఏఎస్‌లు చేస్తున్న సమ్మె విరమింపజేయాలని.. ప్రజలకు ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులను అందించే పథకానికి ఆమోదముద్ర వేయాలని కోరుతూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ దీక్షలో పాల్గొన్న మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.

వరుసగా ఆరు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుండటంతో నిన్న రాత్రి  మంత్రికి కీటోన్ లెవెల్స్ పెరగడం, తలనొప్పి, ఒళ్లునొప్పులతో బాధపడటంతో పాటు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడటంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. దీక్ష కారణంగా నాలుగు కేజీలు తగ్గినట్లు వైద్యులు తెలిపారు.