Asianet News TeluguAsianet News Telugu

ఆప్ వర్సెస్ ఢిల్లీ గవర్నమెంట్! 10 రోజుల్లో రూ. 164 కోట్లు కట్టండి లేదంటే.. ఆఫీసులు మూసేస్తాం.. ఆప్‌కు నోటీసులు

ఢిల్లీలో రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. ‘రాజకీయ యాడ్స్’ఆరోపణల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 164 కోట్లను పది రోజుల్లో చెల్లించాలని స్వయంగా ఢిల్లీ ప్రభుత్వమే నోటీసు ఇష్యూ చేసింది. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రచారాల పేరిట ఆప్ దాని పొలిటికల్ యాడ్స్‌కు ప్రభుత్వ డబ్బును ఖర్చు పెట్టిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
 

delhi govt notice to aap, pay 164 crore in 10 days else face action
Author
First Published Jan 12, 2023, 2:05 PM IST

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒక అరుదైన పరిణామం జరిగింది. ఢిల్లీలో అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ కేజ్రీవాల్ సారథ్యంలో స్పష్టమైన మెజార్టీతో ఆప్ అధికారంలో ఉన్నది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. అయితే, ఇప్పుడు ఆ పార్టీకి సొంత ప్రభుత్వం నుంచే చిక్కు ఎదురైంది. ప్రభుత్వ ప్రచారాల పేరిట పార్టీ ప్రమోషన్స్ లేదా యాడ్స్ కోసం ఖజానా నుంచి డబ్బులు వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ పది రోజుల్లోపు రూ. 164 కోట్లు చెల్లించాలని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఓ నోటీసు జారీ చేసింది. అంతేకాదు, ఈ డబ్బులు నిర్దేశిత గడువులో చెల్లించకుంటే ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ, దాని ఇతర ఆస్తులను సీల్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది.

డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డీఐపీ) ఓ రికవరీ నోటీసును ఆమ్ ఆద్మీ పార్టీకి పంపింది. 2017 మార్చి 31వ తేదీ వరకు అడ్వర్టయిజ్‌మెంట్లపై చేసిన రూ. 99.31 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. మిగిలిన రూ. 64.31 కోట్లు ఆ డబ్బుకు పెనాల్టీ అని వివరించింది. ఒక వేళ ఈ డబ్బులు నిర్దేశిత సమయంలో చెల్లించకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్యాలయం, ఇతర ఆస్తులను సీల్ చేస్తామని అధికారులు తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వార్నింగ్‌ను ఉల్లేఖిస్తూ ఈ ఆదేశాలు చేయడం గమనార్హం.

Also Read: నిందితులు ఎవరైనా వదిలిపెట్టం.. చట్ట ప్రకారం శిక్షిస్తాం - ఢిల్లీ స్కూటీ యాక్సిడెంట్ పై స్పందించిన కేజ్రీవాల్

కాగా, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలను లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ దుర్వినియోపరుస్తూ సీఎం కేజ్రీవాల్, ఆయన పార్టీని టార్గెట్ చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తున్నది. ‘ఢిల్లీ ప్రభుత్వాన్ని, దాని మంత్రులను టార్గెట్ చేయడానికి ఢిల్లీ అధికారులను బీజేపీ దారుణంగా తప్పుడు దారుల్లో వినియోగించుకుంటున్నది. బీజేపీ వాళ్లు సర్వీస్ డిపార్ట్‌మెంట్‌ను వారి నియంత్రణలోకి తీసుకున్నారు. వారిని తమకు వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నారు’ అని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను టార్గెట్ చేయడానికి అధికారుల దుర్వినియోగాన్ని కట్టిపెట్టండని, తమను పని చేయకుండా అడ్డుకోకండని పేర్కొంటూ విమర్శలు చేశారు.

ప్రభుత్వ యాడ్స్ ముసుగులో పొలిటికల్ అడ్వర్టయిజ్‌మెంట్లను ఆప్ చేసిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా డిసెంబర్ 20న యాక్షన్ మొదలుపెట్టారు. కాగా, ఆ ఆదేశాలు జారీ చేసే అధికారం ఆయనకు లేదని ఆప్ అప్పుడు తిప్పికొట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios