ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే ఆసుపత్రులు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే చికిత్స అందజేస్తారని తెలిపారు.

ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారిని సోమవారం నుంచి అనుమతించనున్నట్లు ప్రకటించారు. కోవిడ్ 19 కాకుండా ఇతర వ్యాధుల చికిత్స కోసం వచ్చే వారికి మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనుమతి ఉంటుందన్నారు.

Also Read:లాక్‌డౌన్ పొడిగించాలా, వద్దా?: ప్రజలను కోరిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సోమవారం నుంచి ఆలయాలు, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు తెరుచుకుంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే హోటళ్లు, బ్యాంక్వెట్ హాళ్లను మాత్రం మూసివేసే ఉంటాయని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

అవసరమైతే వాటిని తదనంతర కాలంలో ఆసుపత్రులుగా మలిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు  సీఎం వెల్లడించారు. జూన్ చివరి నాటికి 15 వేల పడకలు అవసరమవుతాయని... ప్రభుత్వం ద్వారా నియమించిన ఓ కమిటీ తెలిపిందని ఆయన అన్నారు.

Also Read:ఢిల్లీలో లాక్‌డౌన్ సడలింపులు.. కేవలం వీటికి మాత్రమే: కేజ్రీవాల్ ప్రకటన

అయితే, అందులో ఇతర రాష్ట్రాల వారికీ అవకాశం ఇస్తే, 9 వేల పడకలు మూడు రోజుల్లో నిండిపోతాయని కేజ్రీవాల్ అన్నారు. న్యూరో సర్జరీ లాంటి ప్రత్యేక శస్త్ర చికిత్సలు చేసే ఆసుపత్రులు తప్ప... మిగిలిన ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని ఢిల్లీ వారికే కేటాయించాలని ముఖ్యమంత్రి అన్నారు.