Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. దగ్ధమవుతున్న రెండు పరిశ్రమలు

రాజధాని నగరం ఢిల్లీ వరుస అగ్ని ప్రమాదాలకు గురవుతోంది. సోమవారం రోజు జరిగిన ఓ అగ్నిప్రమాదంలో 9 మంది సజీవదహనమైన సంఘటన మరచిపోకముందే మరో ప్రమాదం సంభవించింది. నరేలా ప్రాంతంలోని పారిశ్రామిక వాడాలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. 

Delhi: Fire broke out in two factories in Narela
Author
Delhi, First Published Dec 24, 2019, 8:55 AM IST

రాజధాని నగరం ఢిల్లీ వరుస అగ్ని ప్రమాదాలకు గురవుతోంది. సోమవారం రోజు జరిగిన ఓ అగ్నిప్రమాదంలో 9 మంది సజీవదహనమైన సంఘటన మరచిపోకముందే మరో ప్రమాదం సంభవించింది. నరేలా ప్రాంతంలోని పారిశ్రామిక వాడాలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంలో రెండు పరిశ్రమల్లో మంటలు వ్యాపించాయి. భారీ స్థాయిలో మంటలు ఎగసి పడుతుండడంతో రంగంలోకి 27 ఫైర్ ఇంజన్లు దిగాయి. మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిలిండర్ పేలిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మొదట ఒక ఫ్యాక్టరీలో ప్రారంభమైన మంటలు వేగంగా రెండవ ఫ్యాక్టరీకి కూడా అంటుకున్నాయి. ఈ రెండు ఫ్యాక్టరీలకు పక్కనే ఉన్న  మరో ఫ్యాక్టరీకి కూడా స్వల్పంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఆస్తి నష్టం ఉంటుందని భావిస్తున్నారు. ముగ్గురికి గాయాలు మినహా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 

న్యూఢిల్లీలో అగ్ని ప్రమాదం: 9 మంది సజీవ దహనం

ఇదిలా ఉండగా నిన్ననే (సోమవారం) ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ వస్త్ర దుకాణంలో చెరిగిన మంటలకు 9 మంది సజీవ దహనమయ్యారు. 15 మంది గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios