న్యూఢిల్లీలో  ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు.

సోమవారం తెల్లవారుజామున కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. 

ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 8వ తేదీన ఆనాజ్‌మండీ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో కూడ జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది మృతి చెందారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటనలో 43 మంది మృతి చెందినట్టుగా విమర్శలు వెల్లువెత్తాయి.

మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 2 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. 10 లక్షలను పరిహారంగా అందించనున్నట్టుగా ప్రకటించింది.