దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 7 దశల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలని వివిధ సంస్థలు వెల్లడించడం ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే సంస్థ  ఢిల్లీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాన్ని ప్రకటించింది. ఢిల్లీలో బిజెపి హవా స్పష్టంగా ఉండబోతున్నట్లు ఇండియా టుడే సంస్థ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క లోక సభ స్థానాన్ని కూడా గెలుచుకోదని ఇండియా టుడే సంస్థ తెలిపింది. 

ఢిల్లీ (07)

బిజెపి : 6-7

కాంగ్రెస్ : 0-1

ఆప్ : 0

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి.