న్యూఢిల్లీ: దివంగత మాజీ సీఎం షీలా దీక్షిత్ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండేవారు. ఆమె సొంత పార్టీపైనే విమర్శలు చేసిన దాఖలాలు కోకొల్లలు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్న ఆమె కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ పరిణితి చెందిన నేత కాదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకుడిగా ఎదిగేందుకు మరింత సమయం కావాలంటూ వ్యాఖ్యానించారు. వయస్సు, అనుభవం దృష్ట్యా రాహుల్ సమగ్ర నాయకుడిగా ఎదగలేడంటూ షీలా దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారాన్నే లేపాయి.  

ఇకపోతే ఈఏడాది మార్చి 14న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్ కంటే ప్రధానిగా మోదీయే బెటరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం విషయంలో మన్మోహన్ సింగ్ అంత కఠినంగా వ్యహరించలేదంటూ వ్యాఖ్యానించారు. 

పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదంపై ప్రధాని మోడీ కఠినమైన చర్యలు చేపడుతున్నారని ప్రశంసించారు షీలా దీక్షిత్. ఉగ్రవాదంను అణిచివేయడంలో ప్రస్తుత ప్రధాని మోడీకి ఉన్న ధైర్యం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల సత్తా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

షీలా దీక్షిత్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. దీంతో షీలా దీక్షిత్ తన వ్యాఖ్యలపట్ల వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని షీలా దీక్షిత్ చెప్పుకొచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ కన్నుమూత