న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అర్వింద్ కేజ్రీవాల్ కు ఈ మంగళవారం బాగా కలిసి వచ్చింది. ఆయన భార్య సునీతా అగర్వాల్ జన్మదినం కూడా ఈ రోజే. భార్య జన్మ దిన వేడుకలతో పాటు ఆప్ విజయం ఆయనలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందనే చెప్పవచ్చు. 

తన భర్త కేజ్రీవాల్ విజయం కోసం 54 ఏళ్ల సునీతా కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారం సాగించారు. ఆమెకు నెటిజన్ల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేజ్రీవాల్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు ఇరువురు ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేశారు.

Also Read: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్ డేట్స్: అమిత్ షా కు కరెంట్ షాక్...: ఆప్ అభ్యర్ధి అమానతుల్లాఖాన్

హ్యాపీ బర్తే డే సునీతా మేడమ్... మా హీరోకు మీరే బలం... మిమ్ముల్ని చూసి గర్విస్తున్నాం అని ఓ ట్విటర్ యూజర్ అన్నారు. ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వెలువడిన రోజునే పుట్టిన రోజు జరుపుకోవడం ఆనందదాయకమని, కేజ్రీవాల్ వెనకున్న శక్తి మీరేనంటూ మరో ట్విటర్ యూజర్ అన్నాడు. 

మరో వైపు ఓటింగ్ రోజున పోలింగ్ బూత్ వెలుపల కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోను సునీత, కేజ్రీవాల్ దంపతుల కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్ ట్వీట్ చేశాడు. అతను తొలిసారి ఓటేశాడు. 

Also Read: అరవింద్ కేజ్రీవాల్ గెలుపు... ప్రశాంత్ కిషోర్ మాయాజాలం ఇదే!

ఇదిలావుంటే, పార్టీ విజయోత్సవాల్లో టపాసులు కాల్చవద్దని కేజ్రీవాల్ కార్యకర్తలను ఆదేశించారు. టపాసుల కాల్చకుండా స్వీట్లు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. ఢిల్లీ వాయు వాయుకాలుష్యం కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. టపాసులు పేల్చడానికి బదులు ఆప్ కార్యకర్తలు బెలూన్లను గాలిలోకి వదిలి స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు.