అరవింద్ కేజ్రీవాల్ గెలుపు... ప్రశాంత్ కిషోర్ మాయాజాలం ఇదే!

ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ విజయానికి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక కారణమైతే.... అతను నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా బలంగానే ఉంది. రాజకీయంగా ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో వాతావరణం అత్యంత వేడెక్కి, మతం కులం ప్రాతిపాదికంగా, హిందుత్వ కార్డును బలంగా ప్రయోగించింది బీజేపీ. 

Arvind Kejriwal victory.... Prashant Kishor casts his spell again

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ కి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. సడక్, పానీ , బిజిలీ  అంటూ స్థానిక అంశాలపై ఎన్నికలకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ బ్రహ్మాండమైన విజయం దిశగా పయనిస్తోంది. 

బీజేపీ జాతీయ అంశాలపై ఎన్నికలకు వెళితే.... కేజ్రీవాల్ మాత్రం స్థానిక అంశాలను ప్రధాన అజెండాగా చేసుకొని ఎన్నికలకు వెళ్ళింది. ఈ మధ్య కాలంలో రాష్ట్రాల్లో బీజేపీకి తగులుతున్న ఎదురుదెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర, ఝార్ఖండ్, హర్యానా రాష్ట్రాలతో పాటుగా ఇప్పుడు ఢిల్లీ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. 

ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ విజయానికి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక కారణమైతే.... అతను నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా బలంగానే ఉంది. రాజకీయంగా ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో వాతావరణం అత్యంత వేడెక్కి, మతం కులం ప్రాతిపాదికంగా, హిందుత్వ కార్డును బలంగా ప్రయోగించింది బీజేపీ. 

షహీన్ బాగ్ లో సాగుతున్న నిరసనల నుండి మొదలు జె ఎన్ యూ, జామియా మిలియా యూనివర్సిటీ వరకు కొనసాగుతున్న ఆందోళనలు, పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక, అనుకూల ప్రదర్శనలతో ఢిల్లీ ఒక మినీ యుద్ధ భూమిని తలపించింది. 

ఇలాంటి వాతావరణంలో... ఒక మూడు నెలల ముందు కేజ్రీవాల్ గెలుపు నల్లేరు మీద నడుకున్నవారంతా కూడా కేజ్రీవాల్ శ్రమించక తప్పదు అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈ తరుణంలో కేజ్రీవాల్ ప్రశాంత్ కిషోర్ ని తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నాడు. 

ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఏమిటి....?

ఎన్నికల ఓటింగ్  రోజు గనుక చూస్తే కేజ్రీవాల్ మునుపెన్నడూ లేని విధంగా నుదిటి తిలకంతో కనపడడం మాత్రమే కాకుండా తల్లితండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం, దాన్ని మీడియాలో ప్రైమ్ గా కనబడే విధంగా చేసాడు. 

ఇక ఆయన సభళ్లు మాట్లాడుతుంటే... ఎం మాట్లాడారు అనే దానికన్నా అరవింద్ కేజ్రీవాల్ డ్రెస్సింగ్ స్టైల్ పై అందరి దృష్టి పడింది. ఆయన చలికాలంలో తన మార్క్ స్టైల్ అయిన మఫ్లర్ మిస్సింగ్. 

Also read: పోస్టల్ బ్యాలట్లలో కూడా ఆప్ ఆధిపత్యం.... బీజేపీ ఎందుకు కలవరపడుతుంది?

సాధారణంగా అరవింద్ కేజ్రీవాల్ అంటేనే మనకు గుర్తొచ్చేది...టోపీ పెట్టుకొని మఫ్లర్ చుట్టుకొన్న ఒక మనిషి. కానీ ఆయన దానికి భిన్నంగా ఇప్పుడు మఫ్లర్ లేకుండా కనబడుతున్నాడు. మునుపటిలా కాకుండా చాలా బ్రైట్ గా కనబడుతున్నారు. 

ఆయన ప్రచార కార్యక్రమంలో కూడా ఒక కొత్త ఆకట్టుకునే స్లోగన్ కనపడుతుంది. "అచ్చే బీతే పాంచ్ సాల్... లగే రహో కేజ్రీవాల్" బాగా గడిచాయి 5 వసంతాలు.... మీరే కొనసాగండి అని దాని అర్థం. ఈ స్లోగన్ చూడగానే మనకు అర్ధమయ్యే విషయం ఏమిటంటే, ఇది ప్రశాంత్ కిషోర్ మార్క్ స్టైల్ అఫ్ ప్రచారం. సో అరవింద్ కేజ్రీవాల్ లుక్ మారడానికి కూడా వెనక ఉన్నదీ, ఆయన ప్రచార పద్ధతి మారడానికి కూడా కారణం ప్రశాంత్ కిశోరే అన్నది నిర్వివాదాంశం. 

2017లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పై అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు. అప్పుడు  కేజ్రీవాల్ ఏకంగా ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ తమ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే సరిపొద్దని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఒక రెండున్నర సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే... ఇప్పుడు కేజ్రీవాల్ స్వయంగా ప్రశాంత్ కిషోర్ ని తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నాడు. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ కేజ్రీవాల్ ప్రచారానికి నూత్జన జీవం పోసాడు. మొదటగా కేజ్రీవాల్ పోస్టర్ల రంగు మార్చాడు. 

రంగులపట్ల ప్రశాంత్ కిషోర్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎరుపు రంగును వాడాడు. దీనికి రెండు రకాల కారణాలు ఉన్నాయి. బీజేపీ కాషాయ రంగును అంతే బలమైన ఆకర్షణీయమైన ఎరుపు రంగును ప్రాజెక్ట్ చేయడం ఒకటైతే... లాలూ, నితీష్ ల ప్రచారానికి ఒక లెఫ్ట్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసాడు ప్రశాంత్ కిషోర్. ఇక పంజాబ్ లో అతను అకాలీదళ్ తాము మాత్రమే సిక్కుల ప్రతినిధులం అని చెప్పుకొని తిరుగుతున్న సమయంలో సిక్కులకు పవిత్ర రంగైన బ్లూ ని వాడాడు. 

Also read; ప్రశాంత్ కిషోర్ మార్క్: జగన్ నుంచి కేజ్రీవాల్ వరకు...

ఇలా కలర్ సెలక్షన్ లో ప్రశాంత్ కిషోర్ చాలా సెలెక్టివ్ గా వ్యవహరించాడు. ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో నల్లటి పోస్టర్లపైనా అక్షరాలను పసుపు రంగులో రాయడంద్వారా హిందువులకు దగ్గరగా ఉంచే ప్రయత్నం కూడా చేసాడు.  

గతంలో ఢిల్లీ అంతా ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్లు ఇబ్బడి ముబ్బడిగా తెలుపురంగులో వెలిసేవి. ఒక రకంగా ఎక్కడ చూసినా ఈ కేజ్రీవాల్ గొడవేందిరా బాబు అని అనిపించేంతలా ఉండేవి. కానీ ప్రశాంత్ కిషోర్ ఆ తెలుపు రంగును ఒక్కసారిగా నలుపు రంగులోకి మార్చాడు. 

ఇప్పుడు ఎక్కడ చూసినా కేజ్రీవాల్ ప్రచారంలో నలుపు రంగు మాత్రమే కనబడుతుంది. ఒక్కసారిగా తెలుపు రంగు నలుపు లోకి మారడంతో సాధారణంగా కనబడే ఆప్ పోస్టర్లు ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా కనపడుతున్నాయి. 

ప్రశాంత్ కిషోర్ ఈ పోస్టర్ల ఏర్పాటులో మరో నూతన చేంజ్ కూడా తీసుకువచ్చాడు. ఇంతకులు ముంది ప్రతి గల్లీలో కనబడే విధంగా ఆప్ పోస్టర్లు ఉండేవి. కానీ ఈసారి వాటిని కుదించేశారు. ఊరంతా పోస్టర్లు కాకుండా కేవలం 35 భారీ హోర్డింగులను మాత్రమే ఏర్పాటు చేసారు. ఇక ఈ హోర్డింగుల్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ చిత్రాన్ని అత్యంత పెద్దగా కాకుండా చాలా చిన్నగా ఉంచడం జరిగింది. ఇది కూడా కావాలనే చేసారు. 

అంతేకాకుండా ఆయన వినూత్నమైన ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. నుక్కడ్ నాటక్ ల నుండి మొదలు ఫ్లాష్ మాబ్స్ వరకు అనేక రకాల కొత్త ఆలోచనలతో రాజకీయాలను రోడ్లెక్కించారు. అందుకు ప్రత్యేకమైన టీంలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా డిజైన్ చేసిన లగే రహో కేజ్రీవాల్ పాటపైన డాన్స్ చేసేలా డిజైన్ చేసారు. 

ఇలా వారు గాలిలా నుండి మైన రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నళ్ల వరకు ప్రతిచోటా ఇదే విధంగా దూసుకుపోతూ వినూత్నమైన విషయాల ద్వారా కేజ్రీవాల్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. 

ఇలా ఆమ్ ఆద్మీపార్టీ అంటే... కేవలం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే కాదని, పార్టీ అందరిది అని చెప్పే ఒక ఇన్ఫర్మేషన్ గా దాన్ని ప్రొజెక్ట్ చేసారు. ఇలా పసుపు రంగు అక్షరాలా నుండి, కేజ్రీవాల్ బొట్టు పెట్టుకున్న చిన్న ఫోటోల వరకు అన్ని కూడా చాలా ప్రభావాన్ని చూపెట్టాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios