ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా తర్వాత అరెస్ట్ కాబోయేది అరవింద్ కేజ్రీవాలే అని ఆర్థిక నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలోనూ సుకేశ్ చంద్రశేఖర్ పలువురు ఆప్ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

న్యూఢిల్లీ: ఆర్థిక నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్‌ను శుక్రవారం ఢిల్లలోని పాటియాల హౌజ్ కోర్టులో హాజరుపరిచారు. ఓ మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్‌ను ఈ కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తర్వాత అరెస్టు కాబోయేది అరవింద్ కేజ్రీవాలే అని పేర్కొన్నాడు.

లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా తర్వాత అరెస్టు అయ్యేది అరవింద్ కేజ్రీవాల్ అని అన్నాడు. లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం త్వరలోనే బట్టబయలు అవుతుందని ఆరోపించారు. 

Also Read: ఢిల్లీలో కవిత దీక్ష: బీజేపీపై బీఆర్ఎస్ స్ట్రెయిట్ ఫైట్.. విపక్షాల ఐక్యతపై ఆశలు.. కాంగ్రెస్ పాత్ర పై సస్పెన్స్

చంద్రశేఖర్ గతంలోనూ అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, ఇతర ఆప్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 200 కోట్ల అవకతవకలకు సంబంధించిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ జైలులో ఉన్నాడు. ఈయన కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. ఈయనను విచారిస్తున్న తరుణంలో బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహీల పేర్లు మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.